మాధవరావ్
చాలా సంవత్సరాలు బాబాను చూస్తూ ఉన్నా ఆయన్ని పూర్తిగా నమ్మటం జరగలేదు. సాయిదగ్గరలో
ఉన్నా, బాబాను ఒక ఫకీరులాగ భావించాడు తప్ప గురువుగా చూడలేదు. కాని ఆయన పరమ విష్ణు భక్తుడు
రోజు పూజచేసుకోవడం అందరికి సహాయ పడటం, పిల్లలకు పాఠాలు చెప్పడం ఆయన రోజు వారి కార్యక్రమం.
ఇలా దాదాపు 16 సంవత్సరాలు గడిచిపోయాయి. శ్యామాకు దాదాపు 31 సంవత్సరాలు వచ్చాయి. శ్యామాకు
సాయి ఎవరు అన్న విషయం తెలియదు. కాని కొన్ని సంఘటనల తరువాత సాయి యొక్క గొప్పతనం తెలుసుకున్నాడు.
చిదంబర కేశవ్‌గాడ్గిల్ అహ్మద్‌నగర్
జిల్లా కలెక్టర్ దగ్గర పనిచేసే కార్యదర్శి.
తను ఒక మహాత్ముడు చెప్పగా షిర్డిలో ఉన్న సిద్ధ పురుషుడ్ని కలవాలి అని వచ్చారు. అప్పుడు
వారు శ్యామాను కలవడం జరిగింది. మాఊరిలో అటువంటి సిద్ధపురుషుడు ఎవరు లేరు ఒక ఫకీరు మాత్రమే
ఉన్నాడు అని వాళ్ళకు శ్యామా చెప్పాడు. గాడ్గిల్ కొంత అవిశ్వాసంతో బాబాను చూడడం జరిగింది.
అప్పుడు బాబా నేను సిద్ధపురుషుడను కాను నేను ఒక పిచ్చి ముస్లిం ఫకీరును. మీరు ఆ భీమశంకర
ఆలయంలో ఉన్న మహాత్ముడినే సేవించండి. అదే మీకు మంచిది, వెళ్ళండి అని అరవడంతో సాయి యొక్క
గొప్పతనం గాడ్గిల్‌కు అర్ధం అయింది.
తరువాత 1885 లో ఆనంద స్వామి అనే గురువుని
దర్శించటానికి శ్యామా, నందురాం మార్వాడిలో కలసి వెళ్ళాడు. వాళ్ళు షిర్డి నుంచి వచ్చారని
తెలిసి ఆనంద స్వామి బాబాని చూడాలని వాళ్ళతో కలిసి వచ్చారు. ఆయన బాబా ఎంతటి పరమ గురువో
అని పొగడటం జరిగింది. దేవిదాసు, జానకి దాసు సాయితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఇవన్ని
చూసి శ్యామాకు బాబాపై కొద్దిగా నమ్మకం కుదిరింది.
ఒకసారి ఒక భక్తుడు బాబాకు రెండు రూపాయిల
దక్షిణ పంపించడం జరిగింది. బాబా అప్పుడు అక్కడ లేకపోవడంతో శ్యామా సంతకం చేసి ఆ డబ్బులు
తీసుకున్నాడు. బాబాని పరిక్షీద్దామని ఆ డబ్బులను మశీదులో ఒక చోట పాతిపెట్టాడు. కొన్ని
రోజులు గడిచిన తర్వాత శ్యామా ఇంటిలో దొంగలు పడి 200 రూపాయల వస్తువులు పోతాయి. అప్పుడు
శ్యామా బాబా దగ్గరకు వెళ్ళి డబ్బులు పోయిన సంగతిచెప్తాడు. అప్పుడు బాబా "నీకు
చెప్పుకోవడానికి నేను ఉన్నాను, నా రెండు రూపాయలు పోయి ఆరు నెలలు అయింది, నేనవరితో చెప్పుకోవాలి"
అని బాబా అనడంతో, శ్యామా బాబా యొక్క సర్వజ్ఞత్వం అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచి
తను దేహం చాలించినంత వరకు బాబాపై నమ్మకం చెక్కుచెదరలేదు. మనం ఇక్కడ నేర్చుకోవలసినది
చాలా ఉంది. మనము ఒకసారి గురువును నమ్మితే ఆ నమ్మకం ఎప్పటికి పోకూడదు. ఎట్టి పరిస్థితులలో
అది సడలకూడదు.
బాబా మాధవరావ్‌ని శ్యామా అనిపిలవడం
బాబా
మాధవరావ్‌తో 72 జన్మల సంబంధం ఉందని చెప్పడం, శ్యామ అని పిలవడం, ఆయనను బాబా ప్రతినిధిగా చెప్పడం
చూస్తే, శ్యామా ఎంతటి పుణ్యాత్ముడో అర్ధం అవుతుంది. శివుడ్ని చేరుకోవాలంటే నందీశ్వరుని
యొక్క అనుగ్రహం ఎట్లా కావాలో, అట్లే బాబాతో ఏదైనా విన్నవించుకోవాలి అంటే శ్యామా ద్వారా
వెళ్తే పని జరిగేది. బాబా మాధవరావ్‌ని శ్యామా అని ఎందుకు పిలిచారో అనే విషయం బాబాకే
తెలియాలి. శ్యామా అంటె చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. యమునానదిని శ్యామా అని పిలుస్తారు.
మన శ్రీ కృష్ణుడిని శ్యామా అనిపిలుస్తాము. అశ్వమేధ యజ్ఞంలో వాడే అశ్వం పేరు శ్యామకర్ణ
అని పిలుస్తారు. మహల్సాపతి మనవడు మనోహర్‌మార్తాండ్ శ్రీ రమణానంద మహర్షిగారికి ఈ విధంగా
చెప్పాడు. బాబా పాఠశాలను శాల అనేవారు. మాధవరావు మాష్టారు కావడం వలన మాష్టారులో మొదటి
అక్షరం మా, శాలలో శా తీసుకుని శ్యామా అని పిలవడం జరిగింది అని చెప్పారు.
శ్యామా ఒకసారి బాబాపై నమ్మకం కుదిరిన
తరువాత సాయికి పరమ భక్తుడు అయ్యాడు. ఇక వెనుదిరిగి చూడలేదు. ప్రతి పని బాబా అనుమతి
లేకుండా చేసేవాడు కాదు. బాబా అంటే ప్రాణం తన సర్వస్వంగా బావించాడు. అందుకే బాబా కూడా
శ్యామాతో ఎంతో చనువుగా ఉండేవారు. ఎవ్వరు అడగలేని కొన్ని ప్రశ్నలు శ్యామా ద్వారా మనకు
లభించినవి. అటువంటి ప్రత్యేక సంఘటనలను పరిశీలిద్దాము.
బాబా మూడురోజుల సమాధి రహస్యం
సాయి
72 గంటల సమాధి అనంతరం భక్తులందరు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. కాని ఎవ్వరు బాబాను
దానికి సంభందించిన విషయాలు అడగలేక పోయారు. అప్పుడు శ్యామా పరుగున వచ్చి దేవా మీరు ఎక్కడకు
వెళ్ళారు? ఏంచేసారు? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అప్పుడు బాబా ఇట్లా
చెప్పారు.
అల్లా దగ్గరకు వెళ్ళాను, నేను తిరిగి
రాదలుచుకోలేదు. అయితే అల్లా గదాదరుడ్ని ముందు తనలో కలుపుకున్నారు. అతని పూర్వ పుణ్యఫలం
అవతారకార్యం నీవు తీసుకొనుము అని నన్ను పంపించడం జరిగింది.
ఈ గదాదరుడే రామకృష్ణ పరమహంస. ఆయన రాత్రి
గం.1.02 నిమిషాలకు మహాసమాధి అయితే అదే రాత్రి బాబా 3 గంటలకు బాబా మూడు రోజుల తరువాత
సమాధి నుండి బయటకు రావడం జరిగింది.
1886వ సంవత్సరం తరువాత బాబా లీలలు నలుదిశలా
వ్యాపించి చాలా మంది భక్తులు ఆయన కృపకు పాత్రులయ్యారు.
త్రిమూర్తుల దర్శనం
ఒకరోజు
శ్యామా బాబాను వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకం అనేవి నిజమా? అని ప్రశ్నించారు. అప్పుడు బాబా ఏమి సమాధానం ఇవ్వకుండా శ్యామాను తనదగ్గరకు
రమ్మని పిలిచారు. బాబా శ్యామా తలపై చేయిపెట్టారు. సాయి, శ్యామాకు బ్రహ్మలోకం చూపించారు.
శ్యామా బ్రహ్మదేవుని రత్నఖచిత సింహాసనం, వారి కొలువును దర్శించడం జరిగింది. ఆ సత్యలోక
దర్శనం వర్ణించటానికి వీలుకానిదీ అని అని తర్వాత
శ్యామా చెప్పడం జరిగింది. అట్లానే విష్ణులోకం మరియు కైలాసం కూడా చూపించడం జరిగింది.
శ్యామాకు ఈ సుందర దృశ్యాలు చూసి ఆనందంతో పాటు భయం కూడా కలిగింది. ఈ విశ్వరూప దర్శనంతో
శ్యామా బాబా ముందు అర్జునుడు లాగా భయపడుతూ కూర్చున్నాడు. ఆ సాయికృష్ణుడు తన అభయ హస్తంతో
శ్యామాను సంయమన పరిచి ఈ విధంగా చెప్పారు. "శ్యామా
ఈ లోకాలన్ని మనకి కాదు, మన లక్ష్యం వేరు ఆ
లక్ష్యం వైపే మన దృష్టి ఉండాలి".
ఇక్కడ బాబా ఆత్మసాక్షాత్కారం గురించి
చెప్పడం జరిగింది. మానవుడు ఎప్పుడూ ఈ లక్ష్యాన్ని మరచిపోకూడదు. ఈ లక్ష్యం మనం మరచినప్పుడు,
మన ఆత్మహత్య చేసుకున్నట్లే అని మన శాస్త్రాలు చెప్పాయి. ఇక్కడ కూడా మనలను బాబా సరియైన
దారిలో నడిపించడానికే ప్రయత్నించారు.
శ్యామా
ఒకసారి బాబాను ఈ విధంగా అడిగారు.
దేవా! రాముడు లంకకు వెళ్ళడానికి వారధి నిర్మించారు
కదా. దాన్ని ఒక కోటి వానరాలు నిర్మించినట్లు చెప్తారు. ఇదంతా నిజమేనా!
అప్పుడు బాబా, శ్యామా అదంతా నిజమే, సముద్రం
నిజం, రాముడు నిజంగా అక్కడ ఉన్నాడు.
శ్యామా! దేవా! అన్ని వానరాలు ఎక్కడ కూర్చున్నాయి అక్కడ అంత
ప్రదేశం ఉందా!
బాబా: ఆ కోతులన్ని కొమ్మలమీద, చెట్ల మీద, ఎక్కడ స్థలం ఉంటే
అక్కడ కూర్చున్నాయి. అవన్ని చీమల్లాగా కనిపించినవి.
శ్యామా: బాబా నీవు నిజంగా
ఇవన్ని చూశావా!
బాబా: స్వయానా నా కళ్ళతో
నేను చూశాను శ్యామా!
శ్యామా: బాబా నిన్ను మొదట
చూసినప్పుడు నీకు సరిగ్గా మీసం కూడా రాలేదు, మరి నీవు ఇవన్ని ఎట్లా చూశావు.
బాబా: శ్యామా మనిద్దరం
చాలా జన్మల నుండి కలసి ఉన్నాము. నాకు అవి గుర్తు ఉన్నాయి. నీకు అవి గుర్తులేవు.
శ్యామా: నీకు అప్పుడు
ఎన్ని సంవత్సారాలు దేవా!
బాబా: "నువ్వు ఎట్లా
నన్ను చూస్తున్నావో అట్లానే అప్పుడు ఉన్నాను"
శ్యామా: దేవా ఇది నిజంగా
సత్యమేనా!
బాబా: శ్యామా నేనెప్పుడైన
ద్వారాకామాయిలో అబద్ధం చెప్పానా! అంతా నిజమే!
ఈ విధంగా శ్యామా ద్వారా మనకు బాబా నుంచి
మంచి విషయాలు తెలియడం మన అదృష్టం.
నిద్రలో బాబా జపం
కపర్డె
గారు శ్యామా నిద్ర గురించి ఈ విధంగా రాశారు. అది డిశంబరు 8, 1911 వ సంవత్సరం. ఆరోజు
కార్యక్రమాలన్ని పూర్తి అయిన తర్వాత దీక్షిత్ వాడా వరండాలో కూర్చున్నారు. బొంబాయి నుంచి
వచ్చిన ఇద్దరు వ్యక్తులు చక్కగా భజన్లు పాడారు. భీష్మ కూడా ఒకటి రెండు భజనలు పాడారు.
మాధవరావ్ ఆరోజు అక్కడే పడుకున్నాడు. నేను కళ్ళారా చూసి నా చెవులతో విని ఆశ్చర్యపోయాను.
ప్రతిసారి ఆయన గాలి తీసుకుని వదిలేటప్పుడు చక్కగా ఈ శబ్దం వినిపిస్తోంది.
No comments:
Post a Comment