Play Audio |
నాచ్నేకు ప్రాణ రక్షణ
ఒకసారి నాచ్నె 1913వ సంవత్సరంలో షిర్డిలో ఉండగా బాబా ఇలా అన్నారు. "మనం పిచ్చి వాళ్ళను నమ్మకూడదు." ఇది అందరిని ఉద్దేశించి చెప్పినదేకాని నాచ్నేకు ప్రత్యేకంగా చెప్పినట్లు అనిపించలేదు. ఈ హెచ్చరిక 1914లో ఉపయోగపడింది. అప్పుడు నాచ్నే దహనులో కోశాధికారిగా పనిచేస్తూ ఉండేవాడు. రామకృష్ణ బల్వంత్ పాన్సే అనే వ్యక్తికి మతిస్థిమితం తప్పి పిచ్చి వాడిలాగా తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజు నాచ్నే బాబా ఫొటో ముందు కూర్చుని తన నిత్య పుజాకార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ పిచ్చివాడు గుమ్మంలో నిల్చుని ఉన్నాడు. ఇంతలో అతను నాచ్నే మీద పడి రెండు చేతులతో మెడపట్టుకుని నీ రక్తం తాగుతా ఆంటూ గొంతు కొరకపోతాడు. నాచ్నేకు ఏంచేయాలో తోచక, ఉద్ధరిణి చేతిలో తీసికొని అతని నోట్లోకి గుచ్చుతాడు. అలా చేస్తున్నపుడు నాచ్నే వేలును అతను కొరుకుతాడు. అంతలో వాళ్ళ అమ్మ వచ్చి సహాయం చేస్తుంది. నాచ్నే స్పృహ కోల్పోతాడు. తరువాత స్పృహవచ్చి మామాలు స్థితికి వస్తాడు. వేలి గాయం కూడా మాని పోతుంది. తరువాత నాచ్నే షిర్డి వెళ్ళినప్పుడు బాబా అణ్ణాచించిణికర్ అనే భక్తునితో ఇలా అంటారు. అణ్ణా నేను ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఇతను చనిపోయి ఉండేవాడు. ఆ పిచ్చివాడు. ఇతని గొంతు నులిమేసి ఉండేవాడు. అతని బారి నుండి నేను విడిపించాను. ఏం చేస్తాం? నా బిడ్డలను నేను కాపాడకపోతే మరెవరు కాపాడుతారు? అని అన్నారు.
పులి నుంచి రక్షణ
నాచ్నేను
ఇంకో ప్రాణగండం నుండి కూడా బాబా రక్షిస్తారు. ఒకసారి మార్చి 1915లో నాచ్నే, శాంతారాం
మోరేశ్వర్ పాన్సే మరి కొందరు కలసి ఒక దట్టమైన అడవి గుండా ప్రయాణిస్తూ ఉంటారు. చీకటి
పడుతుంది. ఇంతలో రాన్‌షేట్ అనే కనుమ దగ్గరకు
వస్తారు. ఆ ప్రదేశంలో పెద్ద పులులు ఎక్కువగా ఉంటాయి. అకస్మాతుగా ఒకచోట భయంతో ఎద్దులు
వెనుకకు నడవసాగాయి. అదృష్టవశాత్తు అవి బండిని ప్రక్కకు లాగలేదు. అవి ఏమాత్రం జరిగినా
ప్రక్కనున్న లోయలో పడిపోతారు. అంతలో శాంతరాం పాన్సే ఎదురుగానున్న ప్రమాదం చూపిస్తాడు.
ఒక పెద్దపులి ఎదురుగా ఉంది. చీకట్లో దాని కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. బండి లోయలో
పడిపోకుండా చక్రాల దగ్గర రాళ్ళు పెట్టేందుకు పాన్సె క్రిందకు దిగదలచి నాచ్నేను పగ్గాలు
పట్టుకోమన్నాడు. నాచ్నే వెంటనే జై సాయి బాబా! పరుగున వచ్చి మమ్మల్ని కాపాడు అని అరుస్తాడు.
అప్పుడు అందరూ అలా అరుస్తారు. అప్పుడు పులి వాళ్ళ బండి ప్రక్కగా నడుచుకుంటూ వాళ్ళకు
ఏమిహాని చేయకుండా వెళ్ళిపోతుంది. తరువాత నాచ్నే ఇలా చెప్తారు. బాబాపై ఉన్న నమ్మకమే
నాకు ధైర్యాన్ని ఇచ్చి బాబాను ఎలుగెత్తి పిలిచేలా చేసింది. అందుకే ఆ ప్రమాదం నుంచి
మేమంతా తప్పించుకున్నాము. బాబా ఇలా 1916లో కూడా నాచ్నేను జలగండం నుంచి కాపాడుతారు.
జలగండం
1916వ సంవత్సరంలో నాచ్నే దహనులో ఉండేవాడు. అక్కడ ప్లేగు
వ్యాధి బాగా వ్యాపించి ఉంది. నాచ్నే రోజూ ఆఫీస్‌కు వెళ్ళేందుకు ఒకచిన్న సముద్ర పాయను
దాటవలసి ఉంటుంది. ఆ రోజు ఆలస్యం అవడంతో పడవ ఏమిలేదు. ఒక పిల్లవాడి సాయంతో దోనెలో పాయ
దాటడానికి నిశ్చయిస్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తరువాత నాచ్నే ఒక ప్రక్కకు ఒరగగా దోనె
తలక్రిందులవుతుంది. ఇద్దరు నీళ్ళలో పడిపోతారు. ఆ పిల్లవాడు గజఈతగాడు నాచ్నే నీటిలో
మునిగిపోతున్న సమయంలో బాబాను గుర్తు చేసుకుంటాడు. ఇంతలో ఆ కుర్రవాడు దూరంగా నిల్చుని
ఉన్న ఓడ నుండి వేళ్ళాడుతున్న తాడును నాచ్నే వైపు విసిరి వేస్తాడు. ఆ తాడు సహాయంతో నీళ్ళలో
తేలుతూ ఉంటాడు. ఇంతలో ఇంకో పడవ వచ్చి నాచ్నేను రక్షిస్తుంది. ఇలా ప్రాణగండం నుంచి బయట
పడ్తాడు. బాబా అవసరం అయినప్పుడు తన భక్తులను రక్షిస్తూనే ఉంటారు.
టెంకాయ - రెండణాల కథ
1915వ
సంవత్సరంలో నాచ్నే షిర్డికి బయలుదేరతాడు. స్టేషన్‌లో వి.యస్.సామంత్ అనే భక్తుడు ఒక
టెంకాయ, రెండణాలు ఇచ్చి ఆ రెండణాలతో కలకండకొని బాబాకు సమర్పించమని కోరతాడు. నాచ్నే
షిర్డికి వెళ్ళి బాబాకు టెంకాయ సమర్పిస్తాడు. కాని సామంత్ ఇచ్చిన రెండణాల సంగతి మర్చిపోతాడు.
నాచ్నే బాబా నుంచి అనుమతి తీసుకుని ఇంటికి వెళ్ళేందుకు సిద్ధమవుతాడు. అప్పుడు బాబా
అలాగే చితలీ మీదుగా వెళ్ళు కాని ఈ పేద బ్రాహ్మణుడి రెండణాలు నీ దగ్గరే ఎందుకు పెట్టుకున్నావు?
అని బాబా అడుగుతారు. వెంటనే తను చేసిన పొరపాటు అర్ధం చేసుకుని ఆ రెండణాలు బాబాకు ఇస్తాడు.
అప్పుడు బాబా "ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు ఎవరి దగ్గరైన ఒక పని ఒప్పుకుంటే దానిని
బాధ్యతాయుతంగా నిర్వహించు లేదా ఒప్పుకోకు" అని నవ్వుతూ చెప్పారు.
64 రూపాయల దక్షిణ
నాచ్నే
షిర్డిలో ఉండగా శంకరరావు బాలకృష్ణ వైద్య అక్కడకు వచ్చాడు. బాబా అతనిని 16 రూపాయల దక్షిణ
అడిగారు. శంకరరావు తన దగ్గర డబ్బులేదని చెప్తాడు. కాసేపటి తరువాత మళ్ళీ శంకరరావును
32 రూపాయల దక్షిణ అడుగుతారు బాబా. అప్పుడు నాచ్నే, శంకరరావు కలసి బాబా మేము ధనవంతులము
కాము మాదగ్గర అంత డబ్బు ఉండదు. అని అంటారు. బాబా అప్పుడు అయితే 64 రూపాయలు వసూలు చేసి
ఇవ్వండి అని అంటారు. ఈ మాటల్లో అర్ధం అప్పుడు వాళ్ళకు అర్ధం కాలేదు. తరువాత కొన్ని
రోజులకు బాబా అస్వస్థతకు గురి అయ్యారు. అప్పుడు నామ సప్తాహం జరిగింది. అందరికి అన్న
సంతర్పణ చేయాల్సి వచ్చింది. అప్పుడు హేమద్‌పంత్ ఆదేశానుసారం నాచ్నే, శంకరరావు కలసి చందాలు
వసూలు చేశారు. అప్పుడు వసూలైన మొత్తం 64 రూపాయలు. ఆ డబ్బు వారు షిర్డికి పంపారు. ఇంతకు
ముందు బాబా డబ్బులు వసూలు చేసి ఇమ్మన్న విషయం నాచ్నేకు అప్పుడు అర్ధం అయింది.
నాచ్నేకు వెండి పాదుకలు బహుమతి
బాబా
ఒకరు సమర్పించిన వస్తువులను ఇంకొకరికి ఇచ్చిన సందర్బాలు చాలా ఉన్నాయి. అలానే ఒకసారి
1915లో నాచ్నే, శంకరరావు వైద్య కలసి షిర్డికి వెళ్ళారు. వైద్య బాబాకు వెండి పాదుకలు
సమర్పించి మరల తీసుకు వెళ్ళి పూజించాలి అని అనుకుంటాడు. కాని బాబా ఆ పాదుకలను నాచ్నేకు
ఇస్తారు. తరువాత నాచ్నే ఆ పాదుకలను వైద్యకు ఇచ్చివేస్తాడు. తరువాత శ్యామా కల్పించుకొని
ఆ పాదుకలు బాబా నీకు ఇచ్చారు కాబట్టి అవినీవే ఉంచుకో అని చెప్తారు. వైద్య వద్ద మరొక
జతపాదుకలు ఉంటే వాటిని కూడా బాబా అడిగి తీసుకుని నాచ్నేకు ఇస్తారు. అప్పుడు నాచ్నేకు బాబా ఇలా చెప్పారు. "ప్రస్తుతానికి ఇవి నీవే ఉంచుకోని పూజచేసుకో, తరువాత అతనికి ఇవ్వు అని చెప్తారు. కొంతకాలం
తరువాత ఒక జత వైద్యకు ఇస్తాడు నాచ్నే.
ఓం శ్రీ సాయి రామ్!
No comments:
Post a Comment