In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, June 28, 2017

భగవద్గీత 3. 4 -కర్మ యోగం- లోక సంగ్రహమ్



ఈ సృష్టిలోని ప్రతి వస్తువులో జడమైన పదార్ధంతో పాటు చైతన్యం కూడా ఉంది. మనిషిలో మనస్సు శరీరాలు జడమైతే, వీటికి శక్తిని ఇచ్చేది చైతన్యం. మనస్సుకి ఆలోచించే శక్తి ఈ చైతన్యం ద్వారానే వస్తుంది. ఈ చైతన్యమే నేను అని తెలుసుకున్న వారినే జ్ఞానులు అంటారు. వారు సచ్చిదానంద మైన ఆత్మ స్థితిలో రమిస్తూ ఉంటారు. వారు నిత్యతృప్తులు. అట్టివారికి ఎట్టి కర్తవ్యము ఉండదు. కాని వారు ఆసక్తిరహితులై వారి వారి కర్మలను చేస్తారు. అందుకే వారు ఆ కర్మల ఫలితాలకు స్పందించరు. మనము కూడా ఆసక్తి రహితముగా కర్మలు ఆచరిస్తే పరమాత్మ స్థితిని పొందగలము అని భగవానుడు చెప్పారు. ఇలా చేయడం కష్టమని మనం అనుకోవచ్చు, అందుకే భగవానుడు తరువాత శ్లోకంలో ఇలా చెప్పారు. 

కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః !
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి !!

జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితంగా కర్మలను ఆచరించుటవలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమే కర్మలను ఆచరించుటయే సముచితము. 

ఇక్కడ జనకుడు మొదలైన వారు అని చెప్పారు. జనకుడు ఒక రాజు. రాజు ఐన వాడు రోజు ఎన్నో కార్యక్రమాలలో తలమునకలై ఉంటాడు. వారికన్నా మనం ఎక్కువ కర్మలను ఏమి చేయము. వీరు ఆత్మా స్థితిలో ఉండి రాజ్యపరిపాలన చేశారు. అలానే ప్రహ్లాదుడు కూడా ఆసక్తిరహితంగా కర్మలు చేస్తూ రాజ్య పరిపాలన చేశారు. 

పైన శ్లోకంలో భగవానుడు "లోకసంగ్రహమ్" అనే పదాన్ని వాడారు. ఇది అర్ధం చేసుకుంటే మనం ఆధ్యాత్మిక పధంలో ఉన్నత శిఖరాలకు చేరవచ్చు. దీన్ని రోజువారీ జీవితంలో అనుసరిస్తే సుఖదుఃఖాల వలయంలో చిక్కుకోకుండా ఉంటాము. 

సృష్టిక్రమాన్ని సురక్షితంగా ఉంచేందుకు, దానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా సహాయపడటమే లోకసంగ్రహము పాటించుట అని చెప్తారు. ఈ సమస్త ప్రాణికోటి పోషణ రక్షణ బాధ్యతలు మనుషుల పైననే ఉంది. మిగిలిన ప్రాణులతో పోల్చితే మనిషికి బుద్ధి అనే ఆయధం ఉంది. దీన్ని ఉపయోగించకుండా ఉంటే, ఈ బాధ్యతను మనం నిర్వర్తించలేము. ఈ సృష్టి క్రమంలో ప్రతిప్రాణి ఎంతోకొంత తమతమ బాధ్యతలను నెరవేరుస్తుంటాయి. కాని మానవులు మాత్రం కేవలం స్వార్ధం కోసం సృష్టిక్రమానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తారు. అలా అని మనం ఎదో గొప్పగొప్ప పనులు చేయవలిసిన అవసరం లేదు. మనకు ఈ సమాజంలో వృత్తిపరంగా సంక్రమించిన పనులను లోకహితంకోసమే చేస్తే చాలు. ఒక వ్యక్తి తను పని చేసే వ్యవస్థను అందరితోపాటు స్వార్థరహితంగా ముందుకు తీసుకుపోతే, అది సమాజానికి మేలు చేస్తుంది. ఇది ఒక్కరు చేసేది కాదు. అందరు సమిష్టిగా చేయవలిసింది. నాయకులైన వారు ఈ బాధ్యతను నిర్వర్తిస్తే వారిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారు తరిస్తారు. అలానే తల్లితండ్రులు ఆదర్శంగా నిలబడగలిగితే పిల్లలు తప్పకుండా మంచిదారిలో నడుస్తారు. మనం చేసే ప్రతిపనిలో లోకహితం ఉండాలి. అప్పుడు సృష్టిక్రమం చక్కగా సాగుతుంది. 

అందుకే భగవానుడు తరువాత శ్లోకాలలో ఇలా చెప్పారు. 

యద్యదాచరతి శ్రేష్ట: తత్తదేవేతరో జనః !
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే !!

శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులు అనుసరింతురు. అందరు ఆతడు ప్రతిష్టించిన ప్రమాణములనే పాటించెదరు.  


న మే పార్దాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన !
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి !!

ఓ అర్జున! ఈ ముల్లోకములయందు నాకు కర్తవ్యము అనునది లేదు. అలాగే నేను పొందవలిసిన వస్తువు లేదు. అయినా నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. 

అంతే కాక భగవానుడు ఫలితంపై ఆసక్తిని వీడి కర్మలు చేయకున్నచో లోకములో అలాకల్లోలం చెలరేగును అని చెప్పారు. ఈ కర్మలు మానినచో ఈ లోకములన్నియు నశించును అని కూడా తెలిపారు. ఈ అనర్ధం జరగకుండా ఉండాలి అంటే మన వంతు కర్తవ్యం మనం నిర్వర్తించాలి. మనమే స్వార్ధపూరితంగా ప్రక్క దారులు పడితే ఇంక మన ముందు తరాలకు మనం ఏమి నేర్పిస్తాము?

కర్మలు ఒక యజ్ఞంగా మారాలి అంటే లోకసంగ్రహమ్ అనే శుద్ధమైన తత్త్వం ఉండాలి. అప్పుడు మన చిత్తం శుభ్రపడుతుంది. అప్పుడు బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే జ్ఞానం ఉదయిస్తుంది.ఈ జ్ఞానమే మనలను పరమాత్మకు దగ్గర చేస్తుంది. 



ఓం శ్రీ సాయి రామ్  






Bhagavadgita 3.4 Karma yoga - Welfare of the World



In this universe the consciousness is present in every living and non-living objects. The mind and body are said to be non intelligent (jada) and they receive their energy from the Atma. Mind can think, and buddhi can tease things out only  because of the Chaitanya (consciousness). The jnaani is one who understands and experiences this truth. They are always merged in their own self. They are just content. They do not have any specific needs in this world. They perform their karmas without any attachment. Bhagavan said that we can also attain that state if we can start doing our duties and actions without attachment.  We can feel that this is a difficult task but Bhagavan talks about the process and concept of this no attachment in the net verse.

Karmanaiva hi samsiddhi- maasthitaa janak-aadayah!
Loka- Samgraha- mevaapi sampasyam-kartum-arhasi!! (3.20)

Janaka and others attained perfection by performing actions without attachment; Even we need to do our actions for the welfare of the world. 

The kings like Janaka, Asvapathi and Prahlaada ruled their kingdoms and they were immersed in their daily routine. Still they did their actions without attachment. They understood the power of non attachment and they became role models for all of us. 

Bhagavan uses word "LOKA SAMGRAHA" in the above verse. If we can understand the real meaning of this and apply to our daily life,we can also attain this perfection. We can then escape the oddities in life and immerse ourselves in the blissful state. Keeping the universe as it is created and not disturbing this cycle of universe is nothing but Loka Samgraha. Performing our duties in this universe as prescribed is the most important action. All the planets, solar systems, living and non-living objects act accordingly. But man has mind and buddhi which makes us special to use these characters for the good of the universe. If we deviate and become selfish, who can help us. We become so much preoccupied with our own priorities ignoring the universe. This creates an imbalance and then we blame somebody else or nature for these calamities.   

In this universe we all have our own duties and by our past karmas and vasanas we are bund to sertian actions. We can not escape not doing these actions. If we can keep in mind the welfare of the world and community around us then we can learn to perform our actions with non-attachment. If every one is selfless in this way, the universe moves without any disturbance. People like saints teach us this path all the time. We need people in leadership positions to have this kind of thinking. In a family both parents and elders have to keep this in mind. If one generation can learn from the other, this world becomes a peaceful place. 

Bhagavan talks about this very fact in the next verses.

Yadyaaacharati sreshthas-tatta-devetaro janaah !
sa Yat-Pramaanam kurute lokasthadanuvathate !! (3.21)

People follow a great man and the great people become the role models (standard) for other people to follow. 

Na me Paardhasti kartavyam trishu lokeshu kinchana !
Naanavaaptamavaapyam vartha eva cha karmani !! (3.22)

O Arjuna! there is nothing in the three worlds that has to be done by me, nor is there any thing that should be attained by me; yet I engage myself in action. 

Bhagavaan also reiterates that these worlds perish if he does not perform action. We also have to participate in this progress of the universe by performing our duties without attachment towards the objects. What will happen to future generations if we act with selfish attitudes?

If we have the inclination to act for the welfare of the universe then all karmas will be converted to Yagna.  Then our thinking will be purified. If our mind becomes pure, our intellect can distinguish good from bad. This will in turn ignite the lamp of Jnaana. This Jnaana will take us closer to the Paramatma- The supreme.



OM SRI SAI RAM !




Wednesday, June 21, 2017

భగవద్గీత 3. 3 -కర్మ యోగం -యజ్ఞం





భగవానుడు కర్మలు ఎలా చేయాలో, వాటిని కర్మయోగంగా ఎలా మార్చుకోవాలో చెప్పారు. శాస్త్రాలు నిర్దేశించినట్లు కర్మలు చేయాలి అని కూడా చెప్పారు. ఇప్పుడు కర్మలు ఒక యజ్ఞం లాగా చేయాలి అని రాబోయే శ్లోకాల్లో చెప్పబోతున్నారు. ఎవరి ధర్మం ప్రకారం వాళ్లు కర్మలు చేయడంవల్ల ఈ లోకం సమిష్టిగా ముందుకి సాగుతూ ఉంటుంది. కర్మలు కర్మయోగంగా చేయగలిగితే చిత్తం శుద్ధి అవుతుంది. చిత్తం శుద్ధి అయితే జ్ఞాన గురించి తెలుసుకొనే అర్హత వస్తుంది.

కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగ సృష్టి చేసి ఇలా చెప్పారు  " మీరు యజ్ఞముల ద్వారా అభివృద్ధి చెందండి. ఈ యజ్ఞములు కామధేనువు వలె మీ కోరికలన్ని తీర్చును".

యజ్ఞార్ధము కర్మలను చేయు వారిని ఆ కర్మలు బంధింపవు. మనము శాస్త్ర విహితమైన యజ్ఞ దాన తపస్సుల ద్వారా మనము రోజువారి కర్మలను నిర్వర్తించినచో అవి అన్ని యజ్ఞమే అవుతాయి. అందుకే భగవానుడు ఇలా చెప్పారు.

దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః !
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ !!

మనము ఈ యజ్ఞముల ద్వారా దేవతలును తృప్తిపరచాలి. అప్పుడు దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్స్వార్ధముగా మీరు పరస్పరము సంతృప్తిపరుచు కొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు.

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః !
తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః !!

యజ్ఞములద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మానవులకు ఇష్టమైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచేత తీర్చబడిన కోరికలను ఆ దేవతలకు నివేదించకుండా తానే అనుభవించువాడు నిజముగా దొంగయే అని భగవానుడు చెప్పారు.

కర్తవ్య కర్మలు చేయువారిని పొగుడుతూ, అలా యజ్ఞార్ధము కర్మలు చేయనివారిని చోరులుగా చెప్పడం జరిగింది. కేవలము శరీర పోషణకే కర్మలు చేయువారు పాపులు అని భగవానుడు అధిక్షేపించుచున్నారు. ప్రాణులన్ని అన్నం ద్వారా జన్మించును. అన్నం వర్షమువలన ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురియును. వేద విహిత కర్మలు చేయడం చాలా అవసరం. ఈ వేదములు పరమాత్మ నుండి ఉద్భవించినవి. అందువల్ల సర్వ వ్యాపి అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందె ప్రతిష్టితుడై ఉన్నాడు. యజ్ఞ శిష్టాన్నము తిను వారు అన్ని పాపములనుండి విముక్తులు అవుదురు. అలా కాక తమ శరీర పోషణకే ఆహారమును తినువారు పాపమునే తినుచున్నారు.

కర్మ ఫలితం కోసం తపించకుండా కర్మలు చేస్తే అది యజ్ఞమే అవుతుంది. ఎందుకంటే సూర్యుడు తన శక్తిచే లోకాలను రక్షించుచున్నారు. అలానే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తిరగడం ఆపేస్తే ప్రాణుల పరిస్థితి ఏమిటి? ఎవరి ధర్మాన్ని వారు శాస్త్ర విహితంగా నిర్వర్తించడం నేర్చుకోవాలి. బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ఈ కాల చక్రం స్వార్ధరహిత కర్మలనే యజ్ఞాలపై ఆధారపడియున్నది. పరమాత్మ ఇటువంటి యజ్ఞాలలోనే ఉన్నాను అని గట్టిగా చెప్తున్నారు.

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః !
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి !!

ఓ అర్జున! ఇట్లు పరంపరాగతంగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తించనివారు, తన కర్తవ్యములను పాటించకుండా సుఖలోలుడైన వాడు పాపి. అట్టివాని జీవితం వ్యర్ధము.

మనము ఏ వస్తువైనా అనిభవించే ముందు దేవుని స్మరించుట అన్నది చాలా గొప్ప సాధన. అప్పుడు మనము అనుభవించాల్సిన వస్తువు మనము పొందవచ్చా లేదా అన్న సద్విచారము కలుగుతుంది. అప్పుడు మన బుద్దిని వాడుకుంటాము. మనస్సుని ఇష్టము వచ్చిన రీతిలో కదలనివ్వము. ఇలా కామ, క్రోధ, లోభా మోహాలను భగవంతునికి అర్పించే అభ్యాసం మొదలు పెడితే మన దుర్గుణాలన్ని నశిస్తాయి. మన వ్యక్తిత్వం పరిశుద్ధం అవుతుంది. ఇలా కర్మలు చేస్తే అవి అన్ని యజ్ఞంగా మారిపోతాయి. 

మన జీవితంలో మనము కొన్నింటిని ఆశించినప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇలా అందరు ప్రవర్తిస్తే ఇంక అధికారాల కోసం పోట్లాడుకోవలసిన అవసరం లేదు. 

బాబా పంచ మహా యజ్ఞాల ప్రాముఖ్యత బిక్షాటన ద్వారా చేసి చూపించారు .  

దేవ యజ్ఞం: మనము దేవతలకు భక్తితో ఏదైనా సమర్పిస్తే అది దేవ యజ్ఞం అవుతుంది. 

ఋషి యజ్ఞం : మన ఋషులు ప్రసాదించిన శాస్త్రాలను, జ్ఞానాన్ని గౌరవించి వాటిని మన జీవితంలో అవలంభించడమే ఋషి లేదా బ్రహ్మ యజ్ఞం అంటారు. 

పితృ యజ్ఞం: మన పూర్వీకులను గౌరవించి శ్రద్ధాభక్తులతో సేవించాలి. 

మనుష్య యజ్ఞం: తోటి మానవులకు అవసరమైన సహాయం చేయడమే మనుష్య యజ్ఞం. 

భూత యజ్ఞం: మన చుట్టూ ఉన్న అనేక వృక్ష జంతు జాలాన్ని సంరక్షిస్తూ ఉండడమే భూత యజ్ఞం. 


ఇలా ఈ పంచ మహా యజ్ఞాలను మన జీవితంలో పాటిస్తూ మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అప్పుడు కర్మలు కాస్తా కర్మ యోగం అవుతాయి. ఇలా కర్మలు ఆచరించడం వల్ల మన జీవితమే ఒక యజ్ఞంగా మారుతుంది

ఓం శ్రీ సాయి రామ్ 




Bhagavadgita 3.3- Karma yoga- Yagna




Bhagavan reiterated the importance of proper action and performing our actions in the form of Karma Yoga. This will free us from the effects of these karmas. Now Bhagavan talks about doing Karma as Yagna (sacrifice).  He tells Arjuna that by performing our prescribed duties without any attachment and the world survives by the action of everyone.  By being like this we could be free from bondage.

When God created this universe, creator said, "May you prosper by this. May this be a source of desired objects for you".  We were asked to do our duties in the form of Yagna so that we offer “Havis” through Agni so that we can get our wishes through them. We also perform different kinds of worships to fulfill our wishes. But in reality the Yagna means a sacrifice. The action that you perform without selfish attitude is Yagna. If your actions are for the good of other people or society, then that is called Yagna. When we feed ourselves and we offer that food first to God the Almighty, then this is also Yagna. If we breathe the air or eat the food or in fact do anything without thinking about the God, then that act is considered as theft. We do not want to be thieves in this world and bear the consequences of these sins.  Bhagavan talks about this in the following 2 verses.

Devaan Bhavayataanena te deva bhaavayantu vah!
Parasparam bhavayantaha Sreyah parmavaapsyatha!!  (3.11)

May you do your duties to nourish the gods and may the gods nourish you in turn by sustaining the world. This will ensure general prosperity for all.

Ishtaan-Bhogaan hi vo deva daasyante yagna-bhavitaah!
Tair-dattaan-apradaayai-bhyo yo bhunkte sthen eva sah!!  (3.12)

Being satisfied by your performance, gods will supply all necessities to man. But he, who enjoys these gifts, without offering them in return, is certainly a thief.



The scriptures say that all living bodies came from food grains. We are getting food when we have water through rain. The rain comes from the sacrifice or by performing prescribed duties. Gita says “The noble ones, who share their food before eating, are released from all kinds of sins. Others, who prepare food for personal sense enjoyment, verily eat only sin”.  Duties for all the human beings are prescribed in the Vedas and the Vedas are directly given by God. Therefore, it should be followed eternally without expecting the results.  The Sun gives us energy and does not expect anything from anyone. The air, water, and earth do their jobs without expecting any recognition from anyone. If earth says “I will stop orbiting or rotating” what will happen? If Sun does not shine, or there is no air, then what is the status of humanity?  Bhagavan cautions us in the following verse;

Evam Pravarthitam Chakram naanu-varthaya –teeha yah!
Aghaayu-rindriyaa-ramo mogham Paartha sa jeevati!! (3.16)

Oh Arjuna, a man who does not follow these prescribed duties, which are initiated by God in this manner leads a life of sin. He, who lives for the senses, lives in vain.

If we learn to offer ever thing that we do to God first, then there arises a question whether this action is appropriate or not. Then we are using out intellect rather than following the mind. It is important to share the excess with other people and this in turn helps us to not accumulate the impressions. 
When we live our everyday life, we have to learn to respect the rights of others when we claim our rights. If everyone performs their duties as prescribed then we do not have to worry about the rights.

Baba told us about the Pancha Maha yagnas in the form of Panchasoonas by taking alms.  We need to practice these in everyday life.

Deva Yagna: offerings made to Gods.

Brahma or Rushi Yagna: Following our scriptures and our saints.

Pitru Yagna: respecting elders, offering oblations to our ancestors.

Manushya Yagna: Helping the needy and contributing to the wellbeing of the community around us.

Bhuta Yagna: Helping the cause of other living beings around us like plants, animals and nature. 


By adopting these five kinds of yagnas in our life, we can fulfill our duties as prescribed by the scriptures. Then our path to convert karma into Karma Yoga becomes relatively easy.   Then every action can become a True Yagna. 


OM SRI SAI RAM!

Wednesday, June 14, 2017

భగవద్గీత -కర్మ యోగం 3. 2- కర్మాచరణ


 భగవానుడు మిధ్యాచారులు లాగా ఉండద్దు అని చెపుతూ తరువాత ఈ కర్మలు ఎలా చేయాలో చెప్పారు. 

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః !
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేధ కర్మణః !!

నీవు శాస్త్రవిహిత కర్తవ్యకర్మలను ఆచరించుము. ఏలనన కర్మలను చేయకుండుట కంటే చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరించనినచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. 

కర్మ చేయుటకు మానవులకు మాత్రమే అధికారము కలదు. మానవ జన్మలో చేసిన కర్మల ఫలితం అనుభవించుటకు రకరకాల జంతు, మానవేతర జన్మలను ఎత్తవలిసిఉండునుజంతు జన్మలలో ఉన్నప్పుడు పుణ్యపాప కర్మాచరణములు జరుగవు. కేవలము మానవజన్మలో చేసిన కర్మలే బంధహేతువులు. 

 శాస్త్రవిహితములైన యజ్ఞ, దాన, తపశ్చర్యాది శుభకర్మలు కూడా బంధహేతువులుగనే భావింపబడుచున్నవి. ఇలా అయితే అసలు కర్మలు ఎలా చేయాలి?

అసలు కర్మలు చేయకుండా ఉంటె సరిపోతుంది కదా!

దీనికి సమాధానముగా భగవానుడు ఇలా చెప్పారు. 

యజ్ఞార్దాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః !
తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచార !!

ఓ అర్జున! యజ్ఞార్ధము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు; కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్ధమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. 

మనం ఈ శరీరంలో ఉన్నంతవరకు కర్మలు చేయకుండా ఉండలేము. అందుకే ఎలాంటి కర్మలు చేస్తే ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకొని కర్మలు చేయాలి.

భగవానుడు కర్మలను కర్మ యోగంగా మార్చుకోమని చెప్పారు. అలానే ఆ కర్మలు ఆసక్తిని వీడి చేయమని బోధించారు. అసలు మనం ఎలాంటి కర్మలు చేస్తే అవి మనకు బంధంగా చుట్టుకోకుండా ఉంటాయి. ఈ కర్మల ఫలితం మనకు అంటకుండా ఉండాలి అంటే కోరికలను మనోబుద్ధుల పరంగా నియంత్రించడం నేర్చుకోవాలి.  

మనస్సులో వచ్చే కోరికలను నియంత్రించే విధానం:

-ధర్మబద్ధము కాని మరియు అక్రమమైనా కోరికలను దూరంగా ఉంచాలి. 

-నిషిద్ధ కర్మలు చేయకూడదు.

-ధర్మబద్ధమైన కోరికలను కూడా నియంత్రించాలి.

-ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకున్నప్పుడు వాటిపట్ల అనాసక్తితో వ్యవహరించాలి.


బుద్ధిలోనుంచి వచ్చే కోరికలను నియంత్రించే విధానం:

-కర్మను బాధ్యతగా గుర్తించి దాని ఫలితం మీద దృష్టి పెట్టకుండా చేయాలి.

-దేనిని మన హక్కుగా పరిగణించి కర్మలు చేయకూడదు.

-బాధ్యతతో కూడుకున్న కర్మలను మనస్ఫూర్తిగా పూర్తిచేయడం నేర్చుకోవాలి.

-కర్మలు విచక్షణా బుద్ధితో నిర్వర్తించాలి.


ఓం శ్రీ సాయి రామ్ !



Bhagavadgita- 3.2 Karma Yoga- Right action



Bhagavan cautioned us not to be hypocrite and showed us the right way to do our actions (karmas).

Niyatam kuru karma tvam karma jyaayo hyakarmanah!
Sarira-yatraapi cha te na prasiddhyed-akarmanah!!

You perform your bounden duty; for action is superior to inaction. Even the maintenance of the body would not be possible for you by inaction.

As humans people have right to do only their karmas. The fruits of their actions may make humans to take life as animals or other some other forms of life. If we are in these life forms there will be no good or bad deeds. This only happens in human form. Human actions are binding.  

The actions that are performed under the guidance of the scriptures are also considered as binding. Then what kind of actions we need to undertake?

Can we completely avoid doing these karmas.

Bhagavan answers these questions in the next verse.

Yagnaardhaat karmano’nyatra loko’yam karmabandhanah!
Tadhartha karma kounteya muktha-sanghah samachara!!

The world is bound by action other than those performed “for the sake of sacrifice”: do thou, therefore O kounteya! Perform action for Yagna sake alone and free from attachments.

As long as we are in this body we cannot avoid karmas. Then it is better to know what kind of actions are appropriate.

Bhagavan told us to convert karma into a karma yoga. Every action does not bring about bondages upon the doer. We have to just worry about unintelligent activities. These activities will create more impressions on our minds. If we do not want the consequences of these actions, we need to control the desires at the mind and intellect level.

Proper action can be performed as follows.

For actions born out of mind oriented desires:

We have to stay away from illegitimate desires.

We should not fulfill illegitimate desires.

We have to moderate the legitimate desires.

We have to fulfill the legitimate desires without attachment.


Controlling the actions stemming out of intellect:

We have stop thinking about the result of action when performing an action.

We have to avoid falling into the trap of entitled attitude.

We have to renounce rights.

We have to perform our actions with a duty minded attitude.

We have to perform actions with a balancing mind.


OM SRI SAI RAM!

Wednesday, June 7, 2017

భగవద్గీత -కర్మ యోగము 3.1 - మిధ్యాచారి




మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు కర్మలు చేస్తూనే ఉండాలి. కర్మ చేయకుండా ఉండటం సాధ్యం కాదు. అందుకే మనము కర్మను కర్మ యోగంగా మార్చుకోవడం నేర్చుకోవాలి. కర్మ వల్ల ద్వంద్వాలకు లోనవుతాము అంటే కర్మ ఫలితం మనలను సుఖానికి గాని లేదా దుఃఖానికి గాని గురి చేస్తుంది. కాని కర్మను కర్మ యోగంగా మారిస్తే మనం స్థిమితంగా ఉండ గలుగుతాము. ఈ సుఖ దుఃఖాలు మనలను బాధ పెట్టవు. అందుకే భగవానుడు ఇలా చెప్పారు. కర్మ యోగము ముందుగా అలవరుచుకుంటే మన మనస్సు పరిపక్వము చెంది జ్ఞాన యోగ సాధనకు ఉపయోగపడుతుంది. అందుకే మనం జీవితంలో అసలు ఈ కర్మలు ఎలా చేయాలో మొట్టమొదట నేర్చుకోవాలి.

మన జీవితాన్ని నాలుగు విధాలుగా విభజిస్తే
1) విద్యార్థి దశ : ఏదైనా నేర్చుకునేటప్పుడు మనం ఈ దశలో ఉండాలి. అప్పుడు వేరే ఏ ఆలోచనలు రాకూడదు. చిన్నప్పుడు అందుకే చదువు బాగా వంటపడుతుంది.

2) సంసార జీవితం: మనం విద్యను ముగించుకొని, సంపాదనలో పడి, పిల్లలను పెంచి పోషించడం మొదలైన కర్మలన్ని చేస్తాము. బాగా డబ్బు సంపాయించడం, ఆస్తులు కూడబెట్టడం ఇలా ఇంకెన్నో చేయవలిసి ఉంటుంది.

3) ఉద్యోగ విరమణ: బాధ్యతలు తీరిన తరువాత మనం ఇప్పటిదాకా కష్టపడి చేసిన పనులనుంచి సెలవు తీసుకొనే సమయం. తరువాతి తరానికి బాధ్యతలు అప్పచెప్పి భగవంతుని వైపు తిరగవలిసిన సమయం ఆసన్నమైనది అని తెలుసుకోవాలి.

4) ఆధ్యాత్మిక జీవనం: ఇది చివరి స్థితి. ఈ స్థితిలో ఉండాలి అంటే మనం పైన చెప్పిన మూడు స్థితిల్లో కర్మ యోగాన్ని సాధన చేసి ఉండాలి.లేకపోతె చివరిదశలో కూడా సంసార దశలోనే కొట్టుకుంటూ ఉంటాము.

కర్మ యోగం గురించి విద్యార్థి దశలోనే నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకుంటే సంసార జీవితం సుఖమయం అవుతుంది. అప్పుడు తొందరగా బాధ్యతలనుంచి విరమించుకోగలుగుతాము. లేకపోతె ముసలివాళ్ళు అయిన తరువాత కూడా ఆరాటపడుతూ ఉంటాము. ఇంక రిటైర్ అయ్యేది చనిపోయిన తరువాతే. ఎంత తొందరగా కర్మ యోగాన్ని అర్ధం చేసుకంటే అంత తొందరగా మనం ఆధ్యాత్మిక స్థితిలో ప్రయాణం చేయవచ్చు. ఈ స్థితిలో ఎటువంటి కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు. అంటే ఎప్పుడు సమతలో ఉండవచ్చు. ఇదే కర్మ యోగముయొక్క ముఖ్య ఉద్దేశ్యము.

భగవానుడు రెండు దారులు ఉన్నాయి అని చెప్పారు. ఎవరికి ఏ దారి మంచిది అనే విషయం కూడా చెప్పారు. మనలో బాగా వాసనలు ఉండి, పనులమీద ఆసక్తి ఉన్నప్పుడు ముందుగా కర్మ యోగాన్ని అభ్యసించాలి. ఇలా చేస్తే మనసు కుదట పడి ఆత్మ గురించి తెలుసుకోవడానికి అర్హత వస్తుంది. అందుకే అర్జునుడు నేను ఈ యుద్ధం చేయను, ఆత్మను తెలుసుకునే మార్గంలో వెళ్తాను అని చెప్తాడు. కాని అయన ఒక క్షత్రియుడుగా యుద్ధం చేయాలి అని రణరంగంలోకి వచ్చాడు. ఈ వాసన తీరకుండా అయన జ్ఞాన మార్గంలోకి వెళ్ళలేడు. అందుకే భగవానుడు యుద్ధమే నీకు శ్రేయస్కరము అని తెలియ చెప్పారు. కాని ఆ యుద్ధాన్ని ప్రతీకారంతోనో, లేక రాజ్య కాంక్షతోనో చేయకుండా స్వధర్మం కోసం చేయమని చెప్పారు. అప్పుడు వాసనలు ఖర్చు అవుతాయి. వాసనలు తగ్గేకొద్దీ మనసు ప్రశాంతం అయ్యి జ్ఞానం గురించి తెలుసుకొనే అర్హత వస్తుంది. ఇది అర్ధం చేసుకున్నాడు కాబట్టే అర్జునునికి భగవద్గీత బోధించడం జరిగింది.

పంట పండాలి అంటే మొదట భూమిని దున్నాలి. తరువాత విత్తనం నాటాలి. అలానే మన మనస్సుని కర్మ, భక్తి యోగాలతో శుద్ధం చేసుకొని తరువాత జ్ఞానం అనే బీజం నాటాలి. అప్పుడే అది మొలకెత్తుతుంది.

అందుకే భగవానుడు ఇలా చెప్పారు.

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ !
ఇంద్రియార్ధాన్ విమూఢాత్మా మిధ్యాచారః స ఉచ్యతే !!

బలవంతముగా, బయట వరకు ఇంద్రియాలను నిగ్oరహించి, మానసికంగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిధ్యాచారి అనగా దంబి అని అందురు.

మనసు పరిపక్వము చెందకుండా నేను ఆత్మ వైపు నడుస్తాను అంటే కుదరదు. ఒక వేళ గట్టిగా కర్మేంద్రియాలను బంధించినా మనసు అధీనంలో లేక పొతే కుదరదు. ఇట్టి వారినే భగవానుడు మిద్యాచారులు అని చెప్పారు. వీరు హఠ యోగంద్వారా శరీరాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు, సమాధి స్థితిలోకి వెళ్ళవచ్చు, కాని వారిలో వాసనలు తొలగవు. వారు పేరు ప్రతిష్ఠలకోసం, వారు అనుకున్న అభివృద్ధి కోసం పరుగులు పెడతారు. అంటే కర్మ మాత్రమే చేస్తారు. దాన్ని కర్మయోగంగా మలుచుకోవడం నేర్చుకోరు. అందుకే వారికి కష్టాలు తప్పవు. అందుకే భగవానుడు తరువాత శ్లోకంలో ఇలా చెప్పారు.

యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున !
కర్మేంద్రియై: కర్మ యోగమస్తకః స విశిష్యతే !!

అర్జున! మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని, అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మ యోగాచారణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు.

మనసు కోరికతో ఉండి, బయటకు ఇంద్రియాలను నిగ్రహించి నటించే వారిని మిధ్యాచారి అని భగవానుడు పిలిచారు. మిధ్యాచారిని ఆసురీ సంపద గల వానిగా చెప్తారు. వీరి కన్నా సకామ కర్మలు ఆచరించు మనుష్యులే శ్రేష్ఠులు. కర్మయోగాన్ని ఆచరించే వారు వీరందరికన్నా శ్రేష్ఠులు.

మన సమాజంలో కొంతమంది గొప్ప కోసమో, పేరు ప్రతిష్టల కోసమో, ఎన్నో పనులు చేస్తారు. దీనివల్ల వీరికి గాని, వారి కుటుంబానికి నిజంగా ఉపయోగం ఉండదు. అప్పులు చేసి అయినా సరే అందరిముందు గొప్పగా ఉండాలనే ప్రయత్నం వారిని కష్టాలకు గురి చేస్తుంది. అలానే దైవ కార్యాలలో కూడా ఈ గొప్పతనం ప్రదర్శిస్తూ ఉంటారు. పెద్ద విగ్రహాలు పెట్టడం, బాగా ఖర్చుపెట్టి యజ్ఞాలు, యాగాలు చేయడం కూడా వీటికి ఉదాహరణలు. అలా చేసినప్పుడు మన దృష్ఠి అంతా ఈ కార్యాలను సరిగ్గా నిర్వర్తించాలి అనే అంశం మీదే కేంద్రీకృతం అవుతుంది. భక్తి భావంలో లోపం జరిగే ప్రమాదం ఉంది. ఇవన్ని కూడా పైన చెప్పిన మిధ్యాచారికి బిన్నం కావు.

అందుకే మనమందరము కర్మను కర్మ యోగంగా మార్చుకునే విధానాన్ని నేర్చుకోమని భగవానుడు ఆదేశిస్తున్నారు. ఇకనుంచి మనం కూడా ఈ విధానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాము.



ఓం శ్రీ సాయి రామ్ !





Bhagavadgita Karma Yoga 3.1- Midyachaari



As human beings we are supposed to do actions(karma) until we are in this body. No one can live without doing anything. We have to learn to convert each action into Karma yoga. Each action can produce some kind of result either good or bad. But by adopting karma yoga we can have balance in our lives and we can face the difficulties without much trouble. That's why Bhagavan emphasized to purify the mind first with Karma Yoga and then we can become eligible to enter the world of Jnana Yoga. It is important to first learn how to conduct ourselves in our life.

We can divide the human life into four phases:

Student phase: When ever we have to learn some thing we need to be in this phase. As kids there will be no other thoughts and they can focus better on their studies.

Professional Phase: In this phase we earn money, get married, and raise kids. People usually pursue their dreams and lead materialistic life.

Retirement phase: Here they are supposed to take leave from their daily struggles and handover the responsibilities to next generation. Here we need to learn to transition to spiritual life.

Spiritual Phase: This is supposed to be the the phase where we need to have devotion and pursue spiritual goals. One should practice the spiritual life style in all the above three phases. Otherwise it is difficult to adopt this kind of style in the end.

One should learn Karma Yoga from the student life it self. We have to practice karma yoga in the professional phase. Then we have to perfect the spiritual pursuit. If we do not do this, we will be still immersed in materialistic life and taking care of grand children. We will still be taking care of so many things in life.

Bhagavan showed us two kinds of paths depending on our actions. One is karma yoga for people who still struggle with interest in performing actions. Then their mind becomes pure and stable. Then they can understand the knowledge of self. Arjuna wanted to go directly to the state of Self but he was born as Kshatriya and came to fight the war. Without fighting the war he can not go to the next phase. So Lord Krishna knows this truth, that's why he encouraged Arjuna to fight the war. He advised him to fight the war with a duty oriented attitude but not to take revenge or with an interest in kingdom. Then only the past impressions will be cleared which will allow Arjuna to advance in spiritual life.


If we have to harvest, we first have to make the soil ready. Then only we can plant the seeds. In a similar way, we have to make our mind ready with Karma Yoga and then Guru can plant the seed of Jnana. If our mind is not mature enough there is no use. So Bhagavan says in the next verse about this kind of problem.

Karmandriyaani Samyamya ya aaste manasaa smaran!
Indriyaardhaan- Vimudhaatmaa Mithyaachaarah sa uchyate!!

He who, restrains the organs of action, sits thinking in his mind of the sense objects, he of deluded understanding, is called a Hypocrite (Mithyachaari).

People cannot walk the path of spirituality without the mental maturity and openness. The mind has a tendency to repeatedly think some of the thoughts. These repeated thoughts can become actions and in turn these actions will become impressions. These impressions won’t leave us that easy. Even we are showing a physical show of morality and ethics, while mentally living in a sensuous world of objects, what is the use? These people will be adored by the people as sadhus, swamis, and great people. But they are running towards materialism in a different form. They are constantly thinking about expanding their devotees base and doing major events to attract people. Bhagavan is calling these kinds of people Hypocrites (Mithyaachaaras). We should never forget to convert our karmas to Karma Yoga. Bhagavan shows a solution to this problems in the next verse.

Yastvindriyaani manasaa niyamya-rabhate arjuna!
Karmendriyaih karma yogamasakhthah sa visishyate!!

O Arjuna! Whoever controls the senses by the mind, engages his organs of action in Karma Yoga without attachment to the karma itself, will excel.

If someone desires an object inside but on the outside they pretend that they have the control, then they are Mithyachaaris. Some people do actions only if it is beneficial to them. Even the good actions like charity will be done with publicity and exposure. They want to build monuments, temples, and empires. All this is happening because of their past impressions. So Bhagavaan is cautioning here to be careful. He reiterates the importance of detachment and giving up the interest in the result but performing our duty.  If our focus is on conducting major events in the name of God, our mind will be diverted from real Bhakti and concentrate on the details of the event. So we have to be careful.

We will try to learn to convert our karmas to karma yoga as suggested by the Lord. Our each step needs to be in this direction only. We will ask the Sai to give us the strength to walk this path.



OM SRI SAI RAM!