In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, August 30, 2017

భగవద్గీత 4. 2 జ్ఞాన యోగం - వీతరాగ భయ క్రోధః



భగవంతుని గూర్చి తెలుసుకోవాలి అనే తపన ఉన్నవారు సత్య శోధన చెయ్యాలి. అంటే హృదయపు లోతుల్లోకి వెళ్లి పరిశీలించాలి. మనస్సు నిర్మలంగా, పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. పుణ్య పురుషుల స్థాయికి మనం వెళ్ళాలి అంటే సాధన చెయ్యాలి. భగవంతుని యొక్క దివ్యములైన అవతారముల, కర్మల రహస్యములను ఎరిగిన వారికి భగవంతునిపై అనన్య భక్తి, ఆసక్తి ఏర్పడును. అంటే భగవంతునిపై ప్రేమ పెరగాలి అంటే ఆ భగవంతుని గూర్చి తెలుసుకోవాలి. అలానే లౌకిక విషయముల మీద ఆసక్తి తగ్గాలి. మనకు దేని మీద ఆసక్తి ఉంటుందో మనసు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. అందుకే భగవానుడు రాబోయే శ్లోకంలో మనం ఎలా ఉంటే ఆ మోక్షానికి దగ్గరై ఆ స్వరూపంలోనే ఉండిపోతామో అనే విషయాన్ని గురించి చెప్తున్నారు. 

వీతరాగభయక్రోధా  మన్మయా మాముపాశ్రితాః !
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః  !!

ఇంతకు ముందు కూడా సర్వధా రాగ, భయ, క్రోధ రహితులైనవారు, దృఢమైన భక్తి శ్రద్ధలతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన పెక్కు భక్తులు జ్ఞాన తపఃసంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఉన్నారు. 

ఇక్కడ భగవానుడు మనకు ఒక దారి చూపిస్తున్నారు. మనం ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. ఈ దారిలో మనకు కలిగే అడ్డంకులనే క్లేశాలు అంటారు.  ఇవి యోగ శాస్త్రంలో ఐదుగా చెప్పబడ్డాయి. 

1. అవిద్య 
2. అస్మిత 
3. రాగము
4. ద్వేషము 
5. అభినివేశము  

మనమందరము ఈ ఐదు క్లేశాలకు కట్టుబడి ఉంటాము. 

సరైన విజ్ఞానాన్ని తెలిపి సత్యాన్ని వెలుగులోకి తెచ్చేదే విద్య. మనవి కానివి అన్ని మనవి అని అనుకోవడమే అవిద్య. ఈ అవిద్య వల్లే మిగిలిన నాలుగు క్లేశాలు మనలను బాధిస్తాయి. దేహమే నేను అనుకోవడం అవిద్య. ఇలా మనసులో భావించి నేను, నాది అనుకోవడమే అస్మిత. దీన్నే అహంకారము అంటారు. ఈ నేను నాదిలో నుంచే రాగము వస్తుంది. ఈ దేహానికి సంబంధించినవాటన్నిటి మీద మమకారం ఉంటుంది. ఈ మమకారమే రాగం. ఈ రాగం సత్యమనుకుంటూ, ఇదే శాశ్వతం అనుకుంటూ వైరాగ్యమంటే ద్వేషం పెంచుకుంటున్నాము. ఇక చివరిది అభినివేశం. అంటే ప్రాణంమీద తీపి. మనతో ఉన్నవి అన్ని వదిలి వెళ్ళాలి అంటే భయం. నా అన్న వారికి దూరం అయిపోతాం అన్న భయం. ప్రాణాలు దక్కించుకోవడానికి మనం చేయని ప్రయత్నం ఉండదు. ఇది మానవ సహజం. 

అందుకే భగవానుడు రాగభయక్రోధ రహితులమై, స్థిర బుధ్ధితో ఉండి భగవంతునిపై ఆసక్తిని పెంచుకోవాలి. ఇలా ఉన్నవారిని "మన్మయా" అని భగవానుడు చెప్పారు. ఇట్టి వారు సర్వత్ర భగవంతుని దర్శించెదరు. భగవంతుని లీలలు, అవతారములు మరియు దివ్య కర్మలను తెలుసుకొని భగవంతునిపై అనురక్తిని పెంచుకోవాలి. అప్పుడు జ్ఞాన సిద్ది కలిగి మానవుడు తనలోనే భగవంతుని దర్శించగలుగుతాడు. మరి మనుష్యులందరు వేరు వేరు మార్గాల్లో ఆ భగవంతుడిని కొలుస్తారు. ఈ సందేహాన్ని తీర్చడానికే తరువాత శ్లోకంలో ఇలా చెప్పారు. 

యే యధా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ !
మమ వర్త్మానువర్తంతే  మనుష్యా: పార్ధ సర్వశ: !!

పార్ధ! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరును భిన్న రీతులలో నా మార్గమునే అనుసరింతురు. 

మార్గము ఏది అయినా రాగ భయ క్రోధాలు అనబడే ఈ క్లేశాలను అర్ధం చేసుకొని, భగవంతునిపై అనన్య భక్తిని, ప్రేమను పెంచుకొని, స్థిర చిత్తంతో జ్ఞాన తపస్సు చేయాలి. అప్పుడే ఆ భగవంతుని మనలో దర్శించగలుగుతాము. 


ఓం శ్రీ సాయిరామ్ ! 


Bhagavadgita 4.2 - Jnaana Yoga - Veetaraaga Baya Krodha.



We need to have intense passion to know God and we have to search for the truth within us. We have to delve deeper into the depths of our mind. This is only possible when we are with still mind and stay pure. Then only we can even think of reaching to the level of great people. When we make an effort to understand the qualities and divinity of God, we will develop some kind of devotion. When this feeling gets intense there develops unconditional love towards God. There will be less distraction from worldly objects.We all know that our mind is so fluid and we get stuck with certain situations in our life.  Bhagavan gives a path to reach him in the next verse.  

Veeta Raaga Baya Krodhaa manmaya maamupaasritah!

Bahavo jnaanatapasaa putaa madbhaavamaagataah!!

Whoever is freed from attachment, fear and anger, and absorbed in me, taking refuge in me, purified by the fire of knowledge, many have attained My being.


Bhagavan talks about how we need to be in spiritual path and how we can reach him. But there are obstacles during this process. The scriptures of Yoga Saastra talk about 5 main obstacles and they are called Kleshaas.

1. Avidya
2. Asmita 
3. Raaga
4. Dwesha 
5. Abhinivesa 

We are all bound by these 5 kleshaas.  Klesha means suffering, distress and these are hindrances to our goal.

Avidya means misunderstanding the reality. Ignorance of the truth that exists. Teh wisdom that brings the truth to light is called as correct knowledge. This is the main source of all our problems. 

Asmita means thinking about relations and objects as ours. This is nothing but the feeling of Me & Mine. We all exhibit Asmita in the form of Pride. From this feeling come attachment that is Raaga. When ever we cross the limits with this attachment, we will go into Dwesha (Dislike & hatred). Here the core problem is "inability to let go off things". This will lead to Abhinivesa. Abhinivesa means fear of death, fear of leaving every thing and fear of leaving behind what belongs to you. This is a false sense of identity. If we can understand this Abhinivesa properly, half of the problems are over.  

Bhagavan also used a term "Manmaya" which means whoever is absorbed in God. This is possible only when we are free of attachment, fear and anger. When we are totally absorbed in God, then we can visualize God's presence everywhere. We have to have yearning to know God and try to understand the divinity through the qualities of God. Then the true knowledge evolves from within. People choose different paths to reach this goal. In the next verse, Bhagavaan clarifies this aspect of worship. 


Ye Yadha Maam prapadyante taamsthadaiva bhajaamyaham!
Mama vartmanuvartante manushyah Paardha sarvasah !!


O Son of Prtha (Pardha)! in whatever way people approach me, I tend to reward them. People in different paths follow me.  

It does not matter which ever path we choose to reach God, we should over come the obstacles. We need to show extreme passion and love towards God. We need to understand the truth that is within us. Then we will be able to see God everywhere. 




OM SRI SAI RAM!



Wednesday, August 23, 2017

Bhagavadgita 4.1 Jnaana Yoga - Merging with God


Our scriptures say that we take the human from after going through so many other life forms. We might have been born so many times in the past even as a human also. We usually call death as leaving this body and we take with us the subtle and causal body but not the physical body. Along with the subtle and causal body we also gather past impressions and past karmas. Based on these our next life will be decided. These factors will decide whether we are going to be rich, poor, animal, human, and how long we have to live. But when Bhagavan is born we call that as Avatar. We like to say “God came down to earth”.  That is why this is called Descending avatar. Our human lives are Ascending avatars.
For God to be born as a human the determining factor is not past karmas. The Lord is everywhere and all pervasive.  This quality is called as Vishnu which means all pervasive. God is beyond the three gunas or qualities that determine human life. The God has to come down to the human level so that we can communicate and visualize the attributes.
We might have had taken so many lives in the past but we do not remember them. This is actually a gift to mankind otherwise we will be struggling to see our family members all over.  We cannot even imagine how difficult it is to remember all that and live a normal life. We may not remember lot of things but we do exhibit our past tendencies in the form of likes and dislikes. When we pass through different grades in the school, we might not remember everything that we studied earlier year but we move on with an essence. This will give us certain maturity to learn and understand better in the next grades. In a similar way whatever we experienced in previous lives will determine our future lives. This is where we develop relationships, likes, dislikes, difficulties, happiness and sickness. If we sit down quietly and look at our current life, we can imagine what we did in the past lives. Bhagavan emphasizes the importance of following the Dharma and to understand the life in terms of karma theory.
The next verse describes how we can reach God if we follow the scriptures.
Janma karma cha mae divyamevam yo vetthi tatvatah !
Tyaktvaa deham punarjanma naiti maameti sah arjuna !!
One who knows the transcendental nature of My appearance and activities does not, upon leaving the body, take his birth again in this material world, but attains My eternal abode, O Arjuna.


The actions of the Lord are divine and they are beyond the impressions. There is no selfish quality in those actions. There is no doer ship also. All the actions are performed according the needs of the society at that time. The saints also come under this category. Bhagavan himself says that he also comes in the form of great people. They have no special interest in the results of the actions that they perform. They just do what is best for everyone.  
If we understand this principle and follow the Karma theory as prescribed, we will have no difficulties in life. If we are consistent in this path and practice the spirituality according to our scriptures we can definitely reach our goal. The lord guarantees the outcome so that we do not have to go through this life and death cycle.    

OM SRI SAI RAM!

Wednesday, August 16, 2017

భగవద్గీత 4. 0 జ్ఞాన కర్మ సన్యాస యోగము - ధర్మ సంస్థాపన





మనం చిన్నప్పుడు పాఠాలు బట్టీయం పెట్టి చదువుకొని పై తరగతులకు వెళ్లగలిగాము. కాని పై తరగతులకు వెళ్లే కొలది, ఇది ఇలా ఎందుకు ? అది ఇలానే ఎందుకు ఉండాలి? ఇలా కొన్ని ప్రశ్నలు మనలో ఉదయించి మనలను ఆలోచింప చేస్తాయి. ఈ ఆలోచనలే మనం చదివే చదువును బాగా అర్ధం అయ్యేలాగా చేస్తాయి. అలానే మనం అందరు చేస్తున్నారు అని కొన్ని పనులు చేస్తాము కాని ఎంతమంది అలోచించి చేస్తారు. ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు, ఆస్తులు సంపాయించి వారి ప్రాణాలను వదిలివేశారు. వారిగురించి ఎంతమంది తలచుకుంటారు. ఒకరు ఆస్తులు కూడబెట్టి వారి పిల్లలకు ఇచ్చారు, వారు వెళ్ళిపోయినా తరువాత వారి పరిస్థితి ఏమిటి? వారి పిల్లలు ఎంత కాలం వారిని తలచుకుంటారు. కాని ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, వారు తలుచుకోవాలి అని తల్లితండ్రులు అన్ని చేయలేదు. నా వారు అన్న ప్రేమ వారి చేత ఈ పనులన్నీ చేయించినది. కాని ఎక్కడో ఒక స్వార్ధం ఉంది. నిజాన్ని అర్ధం చేసుకోలేని స్థితి. మన జీవిత కాలంలో ఎంత మందినో చూస్తాము అయినా మనం నేర్చుకోము. పాఠాలు అర్ధం చేసుకొని చదివిన దానికి, కేవలం బట్టీయం పెట్టి చదివిన దానికి ఎంత తేడా ఉందొ మన అందరికి తెలుసు. అలానే జీవితంలో చేసే ప్రతి కర్మ మనం ఎందుకు చేస్తున్నాము? ఈ కర్మల వెనుక ఉన్న జ్ఞానం ఏమిటి? మంచి కర్మలు చేస్తూ చెడ్డ కర్మలకు దూరంగా ఎందుకు ఉండాలి అనే రక రకాల మూలా భావాలను తెలిపేదే ఈ నాలుగవ అధ్యాయం. 

భగవానుడు అధ్యాయం ప్రారంభిస్తూ తాను చెప్తున్న సత్యాలు తాను ఎప్పుడో సూర్యుడికి చెప్పానని, ఆ సూర్యుడు వైవస్వత మనువుకి బోధించెనని, ఆ తరువాత మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునికి ఉపదేశించెనని చెప్పారు. అంటే ఈ జ్ఞానం మొట్టమొదటినుంచి ఉంది. అందరికి కలిగే సందేహమే అర్జునునికి కూడా కలిగింది. శ్రీకృష్ణుడు అర్జునుడు బంధువుల్లాగా, స్నేహితుల్లాగా కలిసి పెరిగారు. ఇద్దరికీ దాదాపు ఒకటే వయస్సు, కాని శ్రీకృష్ణుడేమో ఈ జ్ఞానాన్ని సూర్యుడికి చెప్పాను అంటున్నారు, ఇది ఎలా సాధ్యం? అని అర్జునిని సందేహం. అదే ప్రశ్న అర్జునుడు వ్యక్తం చేసాడు. తరువాత భగవానుడు మన అందరమూ ఎన్నో జన్మలు ఎత్తుతాము, కాని అవి మనకు గుర్తు ఉండవు అని చెప్పారు. మరి మహానుభావులు ఎందుకు జన్మలు తీసికొని వస్తారు అనే విషయాన్ని తరువాత శ్లోకంలో చెప్పారు. 

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత !
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ !!

ఓ భారత! ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మము పెరిగిపోయినప్పుడును, నన్ను నేను సృజించుకొందును. అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరింతును. 

ఊరికినే వస్తే సరిపోదు కదా తాను వచ్చి ఏమి చేస్తారో అది కూడా తరువాత శ్లోకంలో భగవానుడు చెప్పారు. 

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ !
ధర్మ సంస్థాపనార్దాయా  సంభవామి యుగే యుగే !! 

సత్పురుషులను రక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును పరిరక్షించుటకు నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. 

మానవులుగా ధర్మముతో బతకటం చాలా అవసరం. ఈ ధర్మము పాటించక పొతే దాని ఫలితాన్ని మనమే అనుభవించాలి. ఒక పిల్లవాడు తప్పు చేస్తే తల్లితండ్రులు వాడికి నయానో భయానో మంచి దారిని చూపించ ప్రయత్నిస్తారు. అలానే భగవంతుడు కూడా ఒక అవతార పురుషుడుగా కాని, లేదా సాధు సంతుల రూపంలో మనలను సరైన దారిలో పెట్టడానికే వస్తారు. 

భగవంతుడు అవతారములు తీసుకోకుండా కూడా ఈ పనులు చేయవచ్చు. ఏదైనా అనుభవంతో నేర్పిస్తేనే నిలబడుతుంది. అందుకే అవతార ధారణ. భక్తులు భగవంతుడికి దగ్గరగా ఉండి, సాకారంగా వారి సాన్నిధ్యాన్ని పొంది ఆనందిస్తారు. మంచివారిని రక్షించడం అంటే దుష్టులనుంచి మాత్రమే కాదు. వారిలోఉన్న కొన్ని చెడు ప్రవృత్తులు వారిని భగవంతుడికి దూరంగా ఉంచుతాయి. ఇలాంటి దుష్ట స్వభావాలను దూరం చేసి మంచి మార్గంలో నడిపించడం కూడా ఒక ఉద్దేశ్యం. ఇలా మారాలి అనుకొనే వారికి సాధుసంతుల రూపంలో అవకాశం వస్తుంది. సత్యాన్ని, ధర్మాన్ని అవగతం చేసుకొనే శక్తి వస్తుంది. ధర్మం లేకుండా ఈ సృష్టి సాగదు. ప్రకృతి తన ధర్మాన్ని తప్పక పాటించాలి. సూర్యుడు తన పని తాను చేయక తప్పదు. అలానే భూమి తన కక్షలో తాను తిరగాలి. వాటి ప్రవర్తన కొంచెం మారినా చాలా ప్రమాదం. మానవులుగా మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి.  



ఓం శ్రీ సాయి రామ్!




Bhagavadgita 4.0 Jnana yoga - Righteousness


As we grow up our level of understanding changes. When we are supposed to learn something in the school we use different techniques. Mostly kids try to memorize and it is difficult for them to comprehend certain concepts at their level. As they go to higher grades, they try to grasp the core concepts of the subject. They also raise so many questions like why things are this way.  How can I explain this? These questions make them think and analyze the situations. This level of analysis and understanding the core concepts will help us to grow. Sometimes we follow other people without proper understanding. We accumulate wealth, run for objects, try to get fame and finally we leave this body like so many other people. The next generation might think about them for a while and later every one forgets them. So we need to take a look at this process of running after fame, wealth and other valuable things in our life. This might be a good thing if you can utilize and enjoy while you are alive. But is it worth to accumulate enormous wealth for next generation at the cost of your life.
Parents work hard and try to give better life to children. This might be thought as the duty of the parents and they do this out of love. But sometimes they can get carried away.  They want the best in everything without understanding the capability of their children.  Everyone has their own interests and destiny. We have to understand why we do actions in the realm of karma theory.  We have to learn to contribute to society and do things for higher cause. This fourth chapter will provide the tools to think properly in our everyday life.  
The fourth chapter begins when Bhagavan talks about how he taught this truth of Bhagavadgita  to the Sun in the beginning . Then Sun passed it on to Vaivaswata Manu . Manu then gave it to Ikshwaka. He also clarifies about his past Avataras and how he can remember these but not Arjuna. Then he goes on to say how the great souls take birth and descend to earth. What is their reason to take a birth as a human in this world?
Yadha yadha hi dharmasya glaanirbhavati Bhaarata!
Abhyuddaanamadharmasya tadaatmaanam srujaamyaham !!
O Bharata! Whenever there is decay of righteousness and raise of unrighteousness, I manifest myself.  
Bhagavan explains why the Avatar will be taken and why the great souls descend to the earth in the next verse.
Paritraanaaya saadhunaam vinaasaya cha dushkrutaam !
Dharma Samsthaapanaardhyaaya sambhvaami yuge yuge !!
For the protection of good, for the destruction of wicked and for the establishment of righteousness, I am born in every age.
As humans it is important to live with good character and righteousness. If we do not follow this we have to face the consequences in a bad way. If a child makes a mistake the parents somehow try to teach the correct way to that child. In a similar way God also wants to establish the righteousness and teach the society to walk in a path that is not detrimental to one’s own wellbeing.   God says he will come in the form of saints and great souls to live among the people so that they can provide the proper direction.  Here in the above verse it says for the destruction of wicked; but it is not really the destruction of people but their wicked qualities.

God can do everything without taking any form also but it is not done that way. This has to be practical and needs to be at human level. Whenever we teach something to people, it is better to teach with an example and by living that experience. Otherwise it is difficult to comprehend. That’s why a form is necessary to be close to the human level. Even righteous people have negative tendencies at times. This keeps them away from God. Here God makes sure that these negative tendencies are mitigated so that they can open up their hearts. People can live with wisdom with which they will get to know God and themselves.  Righteousness is essential to attain the ultimate freedom. The universe operates with an order and if the order is missed everything dissipates. The Sun is essential to the life on the earth. The earth keeps rotating in a particular orbit. The entire universe follows the higher cause. As humans we also need to keep this in mind when we perform our actions.

OM SRI SAI RAM!

Wednesday, August 9, 2017

భగవద్గీత 3. 8 కర్మ యోగం - కోరికయే మూల శత్రువు



 మన కర్మానుసారంగా మూట కట్టుకొని వచ్చిన స్వధర్మాన్ని పాటించడం చాలా అవసరం అని భగవానుడు చెప్పారు. మానవులు తమ ధర్మానికి విరుద్ధంగా, ఇతరులు బలవంత పెట్టినట్లు ప్రేరిపితులై పాపములను చేయుటకు గల కారణము వివరించవలిసినదిగా అర్జునుడు భగవానుని అర్ధించాడు. అప్పుడు భగవానుడు ఈ విధముగా సమాధానము చెప్పారు.

కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః !
మహాశనో మహా పాప్మా  విధ్యేనమిహి వైరిణమ్ !!

భగవానుడు ఇట్లు పలుకుచున్నారు. రజోగుణం నుండి వచ్చునదే కామము. ఈ కొరికయే క్రోధరూపమును దాల్చును. ఇది మహాశనము. ఇది కోరికలు తీర్చుకుంటూ పొతే చల్లారేది కాదు. పైగా అంతులేని పాపకర్మలకు ఇదియే ప్రేరకము. అందుకే కామమునే పరమ శత్రువుగా చెప్పడం జరిగింది.

కామము క్రోధము మొదలైనవన్నీ శత్రువులే. కానీ ఇక్కడ భగవానుడు ఒక్క కామమునే శత్రువుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొరికే అందరిని క్రోధం వైపు తీసుకుపోతుంది. ఈ కోరిక మనలోని జ్ఞానాన్ని కప్పివేసి మనలను అంధులుగా మారుస్తుంది. అందుకే భగవానుడు తరువాతి శ్లోకంలో ఇలా చెప్పారు.

ధూమేనావ్రియతే వహ్ని: యధా ఆదర్శ: మలేన చ !
యధోల్భేనావృతో గర్భ: తధా తేనెదమావృతమ్ !!

పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మాయచే గర్భము కప్పివేయబడునట్లు, జ్ఞానము కామముచే ఆవృతమై యుండును.

మన కోరికలే మనలను అశాంతికి గురి చేస్తాయి. ఈ కామమే మల, విక్షేప, ఆవరణములు అనే మూడు దోషములుగా పరిణితి చెంది, మనలోని జ్ఞానాన్ని కప్పివేయును.   అప్పుడు మనలోని విచక్షణా శక్తి నశిస్తుంది. ఈ కోరికకు ఏమైనా అడ్డంకులు కలిగితే అది క్రోధంగా రూపు దిద్దుకుంటుంది. కోరిక అగ్నితో సమానమైనది. అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు అది నిత్య వైరి అని, ఇది మనుష్యుని జ్ఞానమును కప్పివేయును అని భగవానుడు చెప్పారు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఇవన్నీ కలిపి జీవుని మోహితునిగా మార్చివేయును.

దీనిని దాటాలి అంటే మనం ఏమి చేయాలో భగవానుడు తరువాత శ్లోకంలో ఇలా  చెప్తున్నారు.

మొదట ఇంద్రియములను వశపర్చుకోవాలి. ఇది అంత సులభమైన కాదు అని మనం అనుకోవచ్చు, కాని భగవానుడు అభ్యాస వైరాగ్యముల ద్వారా ఈ కోరికను జయించవచ్చు అని చెప్పారు. కోరికలను అర్ధం చేసుకోవడం మొదలు పెడితే వాటిని నియంత్రించే మార్గం దొరుకుతుంది. ఎలాగైనా పాపి అయిన ఈ కామాన్ని అడ్డుకోవాలి. బుద్ధి ద్వారా మనస్సుని అదుపులోకి తెస్తే కోరికలు వాటంతట అవే దారిలోకి వస్తాయి.

భగవానుడు మూడో అధ్యాయం ముగిస్తూ కోరికలను అదుపులో ఉంచే మార్గాన్ని వివరించారు. స్థూల శరీరం కంటె ఇంద్రియములు బలీయములు, సూక్షములు, శ్రేష్ఠములు అని మన శాస్త్రాలు చెప్తాయి. ఇంద్రియములకంటే మనస్సు, దానికంటెను బుధ్ది శ్రేష్టమైనవి. బుద్ధి కంటె ఆత్మ అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది. బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని కోరికను జయించవచ్చును. కోరికను జయించడం అంటే కోరికలను చంపుకోవడం కాదు. వాటిపై ఆసక్తిని పోగొట్టుకావాలి. మనము ఈ శరీరంతో వచ్చింది సుఖ దుఃఖాలను అనుభవించడానికే. పూర్వ జన్మ కర్మల ఫలితాలకు అనుగుణంగా మన జీవితం సాగుతుంది.

కర్మ  యోగాన్నిఅవలంబించడం మొదలు పెడితే జీవితం సుఖమయం అవుతుంది. కోరికలను నియంత్రించగలుగుతాము. అప్పుడు ఆత్మ తత్వాన్ని అర్ధం చేసుకోగలుగుతాము. 

ఓం శ్రీ సాయి రామ్ ! 




Bhagavadgita 3.8 Karma Yoga - Desires



Bhagavan emphasized the importance of one's own duty that is "Swadharma". Dharma essentially means "The law of being". Arjuna asks Bhagavan "Why people are compelled to commit sins against their wishes". Then Bhagavan answers as follows.

Kama esha krodha esha rajoguna samudhbhavah !
Mahasaano mahapaapma viddhyena-miha vairinam!! 

"It is desire, it is anger born out of passion (rajo guna), alldevouring, all sinful; know this as the enemy in this world"

The Bhagavan speaks as follows.
Desires originate from Passion (rajo Guna) and the desires in turn lead to anger if they are not fulfilled. There is no end to this cycle and desires can never be satisfied. They will arise one after another. This is like objects in the fire. The fire will be more intense as we add more objects to it.  This is what compels us to commit sins. That’s why Bhagavan says that the passion towards desires is our worst enemy.
Desires, anger and other qualities like greed, jealousy etc. are all enemies but desire is the prime problem in this group. This is what takes us towards losing control. We want things around us certain way and if they are not we feel uncomfortable. This will mask our intellect and we will turn a blind eye towards reality. In the next sloka Bhagavan explains this way.
Dhumenaavriyate vahnih yadha adharsah malena cha!
Yadholbhenaavrutogarbhah tadhaa tenedamaavrutam!!
As fire is enveloped by smoke, as a mirror by dust, as an embryo by the womb, so this wisdom is enveloped by that desire.
Our desires make us unhappy. The unhappiness comes both from good and evil desires. We are worried about losing the good things and we shy away from the uncomfortable feelings. The passion with which we organize and conduct ourselves will create more problems. In this process our intellect is blocked as smoke envelops the fire. There is no clarity when the mirror is not dust free. The selfish nature in the human mind will compel us to continue this vicious cycle. We cannot escape from committing sins as desire and anger overtakes our intellect. The sense organs, mind and intellect are the main sources for these desires and they trip us in our life.
What do we need to do to overcome this problem?
First we have to learn to control the sense organs which may not be that easy. But Bhagavan says   this is possible through practice and dispassion towards the objects. We have to understand the desires and their origins. Once we start understanding the root of the desires, then we control the senses easily. By any means we have to start practicing this method. While concluding the third chapter Bhagavan summarizes the methods to control desires. The sense organs are much more subtler than the external body. The mind is more subtle than sense organs. Then the intellect comes into the picture. The soul (Atma) is subtler than all of them. If we can use our intellect we can easily control our mind. Most important aspect of controlling desires is controlling the attachment towards the objects. Bhagavan also highlights this point and people should not misunderstand that we should live without desires. This is wrong notion about the spirituality. We can enjoy what comes along but we have to monitor the attachment and passion with which we crave for those objects.

We took life to go through pains and pleasures. No one can escape this as this is dependent on our past actions. If we start practicing the principles of Karma Yoga we will live our lives with completeness and joy. We can face any life circumstance with intelligence and resolve.  

OM SRI SAI RAM !

Wednesday, August 2, 2017

సాయి మానస పూజ





ఆత్మ స్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరాచరాలలతో బహుచక్కగా కనిపిస్తుంది. అద్దంలో కనిపించేవన్ని వాస్తవానికి అద్దంలో ఉండవు. నిద్రలో కనిపించినవి మెలుకువ రాగానే నశించిపోతాయి. జాగ్రదావస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. విశ్వం యొక్క స్పురణ, సత్తా మరియు ఆధిష్టానమైన, గుర్వాత్మ అగు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ స్వరూపము సత్య స్వరూపము మరియు స్వప్రకాశకమైనది. గురువు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయమైన ఈ దృశ్యజగత్తు తత్వ జ్ఞానంతో  లయమై పోతుంది.

అందుకే మనము బాబాను ఇలా ప్రార్ధించాలి. 

బాబా నా బుద్ది ఆత్మ పరాయణ అయి నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయుము తండ్రి.

నేను అవివేకిని మూఢుణ్ణి. నా బుద్ధి అజ్ఞానంతో ఎప్పుడూ దారి తప్పుతుంది. నాకు నీయందు దృడ విశ్వాసం ఉండేలా దీవించు.

నా అంతఃకరణం అద్దంలా  నిర్మలమై, అందు ఆత్మ జ్ఞానం ప్రకటమయ్యేలా చేయండి.

సద్గురుసాయీ! శరీరమే, నేను అని తలచే మా అహంభావాన్ని మీ చరణాల యందు అర్పిస్తాము. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి.

మా శరీర అభిమానాన్ని తీసుకోండి. మాకు సుఖ-దుఃఖాలు తెలియకుండా పోవాలి. మీ ఇష్ఠానుసారం  మీ సూత్రాన్ని నడిపించి మా మనసులను అరికట్టండి. లేదా మా అహంభావం కూడా మీరే అయి మా సుఖ-దుఃఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి. మాకు దాని చింత వద్దు.

జయజయపూర్ణకామా! మాకు మీయందు ప్రేమ స్థిరపడుగాక, మంగళదామా! ఈ చంచలమైన మనస్సు మీపాదాలయందు విశ్రాంతిని తీసుకొనుగాక.

శంకరాచార్యులవారు శివ మానసపుజా స్తోత్రం ఈ జగతికి ప్రసాదంగా ఇచ్చారు. ఆయన ఈ మానసపూజను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారు. ఆయన ఆ స్తోత్రంలో ఇలా చెప్తారు.

ఆత్మత్వం గీరిజామతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం

నా ఆత్మవు నీవే, పార్వతియే శక్తి. నా పంచప్రాణాలు నీ ఆధీనాలు, ఈ శరీరమే నీకు గృహం. నా ఇంద్రియ సుఖాలే నీ పూజలో ఉపయోగించే సాధనాలు. నా నిద్రే నా సమాధి స్థితి. నేను ఎక్కడ నడచిన చుట్టు నీవే ఉంటావు. నా వాక్కు ఉన్నది నిన్ను స్తుతించదానికే, నేనేమి చేసినా అది నీ పట్ల భక్తిని వ్యక్తపరచాలి దేవా! అని చక్కగా వర్ణిస్తారు. 

ఇలానే హేమద్‌పంత్ సాయి సచ్చరితలో సాయిమానసపూజను చక్కగా వ్యక్తపరిచారు.

సాయిదేవా! మాకు ప్రేరణ కలిగించేది మీరే. మావాక్కును నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయడానికి నేనెవరిని? చేసేవారు చేయించేవారు మీరొక్కరే. మీతో సత్య సమాగం మాకు ఆగమనిగమాలు.

నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం. అనుక్షణం మీ నామవర్తనే మాకు కథా కీర్తన. అదే మా నిత్యానుష్టానం, అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాల మాకు వద్దు. పరమార్ధంలో ఇంతకంటే అధికంగా అధఃపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి?

ఆనందాశ్రువుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను.
నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పుస్తాను.
మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను.

బాహ్యోపచారపూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మిమ్ము ప్రసన్నులను చేసి సుఖ సంతుష్టుణ్ణి అవుతాను.
సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనస్సుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను.

శ్రద్ధ, భక్తి అనే బుక్కాను మీ నొసట అద్ది దృఢమైన విశ్వాసమనే మొలత్రాటిని మీ నడుముకు బంధించి, మీ పాదాంగుష్టాల  యందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను.

ప్రేమరత్నాలతో మిమ్ములను అలకరించి నా సర్వస్వాన్ని మీకు దిగదిడుపు దిష్టి తీస్తాను.

నా పంచప్రాణాలను వింజూమరలుగా వీస్తాను.

మీ తాపనివారణ కొరకు తన్మయత్వమనే గొడుగు పట్టుతాను.

ఈ విధంగా గంధం, అర్ఘ్యం మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజా! మా మంచికోసం మీకు స్వానందపూజ చేస్తాను.


నా మనోభీష్టాలు తీరడానికి ఎల్లప్పుడూ సాయి సమర్ధ అని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్ధం సాధిస్తాను.

నిష్ఠతో కృతార్థుడను అవుతాను. 


ఓం శ్రీ సాయి రామ్ !