In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, September 27, 2017

భగవద్గీత -4. 6 జ్ఞాన యోగం - పరమశాంతికి అర్హత





భగవానుడు జ్ఞాన యజ్ఞము అన్ని యజ్ఞాలలో కన్నా శ్రేష్టమైనది అని చెప్పారు. అట్టి జ్ఞానాన్ని పొందితే పరమశాంతి కలుగుతుంది అని మన శాస్త్రాలు చెప్పాయి. కాని ఇప్పుడు అటువంటి శాంతి పొందటానికి కావాల్సిన అర్హతలను భగవానుడు చెప్పబోతున్నారు.

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం  తత్పరః సంయతేంద్రియ : !
జ్ఞానం లబ్ధ్వా పరాం  శాంతిమచిరేణాధిగచ్ఛతి !!

జితేంద్రియుడు, సాధన పరాయణుడు, శ్రద్ధ కలిగిన వాడు అయిన మానవునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఆతడు సచ్చిదానంద తత్వ రూపమైన పరమశాంతిని పొందును.

మనం జీవితంలో ఏమి సాధించాలన్నా పట్టుదలతో, ఆసక్తితో, వేరే విషయాలమీదికి మనస్సు పోకుండా మనం సాధించాలి అనుకున్న దానిమీద శ్రద్ధతో పనిచేయాలి. అప్పుడే ఆ ఫలితాన్ని పొందగల అర్హత మనకు వస్తుంది. చాలామంది నేను బాగా కష్టపడ్డాను అనుకుంటారు. కాని నాకు అనుకున్న ఫలితం రాలేదు అని బాధ పడతారు. ఇలా పొందకుండా ఉంటానికి కారణాలు బయట వెతుకుతారు. ఫలితం దక్కించుకున్న వారికి, దక్కనివారికి తేడా ఎక్కడో ఉంది. ఆ తేడాను భగవానుడు ఈ శ్లోకంలో చెప్పారు. ఒక కార్యం సాధించాలి అంటే మూడు అర్హతలు ఉండాలి. వీటిలో ఎక్కడ లోపం జరిగినా ఫలితం ఇంకోరకంగా ఉంటుంది.  ఇది ఒక్క ఆధ్యాత్మిక విషయంలోనే కాదు జీవన సమరంలో కూడా ఇది వర్తిస్తుంది.

శ్రద్ధావాన్ అని మొట్టమొదటగా చెప్పారు. అసలు శ్రద్ధ అంటే ఏమిటి? మన శాస్త్రాలయందు, భగవంతునియెడ, మహాపురుషుల వచనములయందును, పరమాత్మ యందును పూజ్యభావము, ఉత్తమోత్తమ భావము కలిగియుండు స్థితిని శ్రద్ధ అని అంటారు. అందుకే భగవానుడు జ్ఞానులు,తత్వ దర్శులు అయిన పరమగురువులను ఆశ్రయించి వారికి ప్రణిపాతము చేసి, సేవలొనర్చి, భక్తి శ్రద్ధలతో, జిజ్ఞాసతో వారిని ప్రశ్నించి తత్వ రహస్యాన్ని తెలుసుకోవాలి అని పూర్వ శ్లోకంలో చెప్పారు. కొంచెం తెలుసుకొని మిడి మిడి జ్ఞానంతో అన్ని తెలుసు అనుకుంటే మనం ఆ ఫలితాన్ని పొందలేము.

తత్పరః అంటే సాధనపరాయణుడు. అభ్యాసము లేకుండా మనం ఏ పనిని సంపూర్ణం చేయలేము. సాధన అనేది ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఈ సాధనకు మూలము శ్రద్ధయే. సాధన అంటే మనం నమ్మిన దానిని మనసా వాచా కర్మణా రోజూ ఆచరించడమే. ఈ ఆచరణ లోపరహితంగా ఉండాలి. ఒక విద్యార్థి తను అనుకున్న పరీక్షలో ఉత్తమ ఫలితం సాధించడానికి ఎంతో కష్ట పడతాడు. వేరే ఆలోచనే లేకుండా తన లక్ష్యం మీదే ద్యాస ఉంచుతాడు. ఈ ప్రక్రియ మనం రోజు చూస్తున్నదే. ప్రతిఒక్కరు వారి జీవితంలో ఎప్పుడో ఒక అప్పుడు చవిచూసిందే. ఒకరు జీవితంలో బాగా కష్ట పడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి సంపద గడిస్తారు. వారు నిద్రాహారాలను కూడా లెక్క చేయరు. అలానే భగవంతుడి విషయంలో కూడా మనకు శ్రద్ద ఉండి సాధన చేస్తే తత్వ దర్శనం అవుతుంది.

ఇక చివరి అర్హత సంయతేంద్రియ: అని భగవానుడు చెప్పారు. అంటే మనం మన ఇంద్రియాలను అదుపు చేసి, మన లక్ష్యం వైపే మన దృష్టి ఉంచాలి. మన మనస్సు ఎప్పుడు వేరే వస్తువుల మీదకే వెళ్తూఉంటుంది. అందుకే మన లక్ష్యానికి బిన్నంగా ఉన్న వాటిమీద మనకు కాస్త వైరాగ్యం ఉండాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచి, శ్రద్ధతో సాధన చేస్తే ఏ లక్ష్యం అయినా మనకు చేరువ అవ్వాల్సిందే. మనకు లక్ష్యం గురించిన అవగాహన ఉండచ్చు, మనమీద మనకు నమ్మకం ఉండచ్చు కాని సరిఅయిన సాధన లేకపోతే మనం నిరాశకు గురి అవుతాము.

పైన చెప్పిన మూడు అంశాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. దేనిలోనైనా కొంచెం లోపం ఉన్నా మనం పూర్తి ఫలితాన్ని పొందలేము. ఒక్కసారి ఇవి అన్ని సమగ్రంగా కుదిరి పరమాత్మ తత్త్వం అనుభూతి కలిగితే మనమే పరమశాంతిగా నిలిచిపోతాము.

చివరగా ఈ అధ్యాయం ముగిస్తూ భగవానుడు ఇలా చెప్పారు.

విధిపూర్వకంగా కర్మలు చేస్తూ, కర్మ ఫలములను భగవదర్పితం చేస్తూ, వివేకం ద్వారా సంశయములన్నిటిని తొలిగించుకొనుచు, మనస్సుని వశమునందుంచుకొనిన వానిని కర్మలు బంధించవు అని గట్టిగా చెప్పారు. అందుకే ఈ నాలుగో అధ్యాయం పేరు జ్ఞాన కర్మ సన్యాస యోగము అని కూడా పిలుస్తారు.

మనం చేసే చాలాపనుల్లో వచ్చే ఫలితాన్ని పూర్తిగా అనుభవించకుండా వేరే వాళ్ళు మనలను గుర్తించలేదు అన్న బాధ కొంతమందిని నిరాశకు గురి చేస్తుంది. నాకు సరిఐన గుర్తింపు రాలేదు అన్న బాధ ఉంటుంది. ఇలా మనం ఆనందంలోకూడా దుఃఖాన్ని వెతుక్కుంటాము. ఇలా చేయకుండా మనకు లభించిన ఈ క్షణాన్ని మనదిగా చేసుకుందాము. ఫలితాన్ని పూర్తిగా ఆస్వాదించడం అలవాటు చేసుకొందాము. అప్పుడే మనలో శ్రద్ధ పెరుగుతుంది. సాధన గట్టిపడుతుంది. సాధన గట్టిపడితే జ్ఞానం వ్యక్తమవుతుంది. అప్పుడు పరమశాంతిరూపమైన భగవత్తత్వం అనుభవమవుతుంది.



ఓం శ్రీ సాయి రామ్ !









   

Bhagavadgita 4.6 Jnaana Yoga - Steps to realize God




The Lord says Jnaana Yagna is the best of all the yagnas. When we acquire such a knowledge we attain the ultimate happiness. Now the Lord talks about the steps to attain that ultimate knowledge. .

Sraddavaan Labhate jnaanam tatparah samyatendriyah !
Jnaanam labhdwaa paraam santhimachirenaadhigachhati !!

The man who is full of faith, who is devoted, and who has subdued the senses, obtains the knowledge and having obtained the knowledge, he attains the supreme peace. 

We have to work hard, without any distractions if we ever want to achieve anything in life. Then only we can maximize our effort. If we just assume that we worked hard without doing so, we will be disappointed in the end. We try to find reasons out side of ourselves which could be a spurious effort. There will be some subtle differences between people who reached their goals who just missed. This is what Bhagavan trying to teach in the next verse in the form of 3 steps. This can be easily applied in every aspect of our lives. 

Faith is the first step mentioned with out which no body can do anything. Here faith means not only believing in themselves but they should have unwavering belief in the scriptures, God himself, the teachings of God, and purity in the belief. Our scriptures does not want you to have blind belief and they want you to question so that we can learn properly. In the previous verses Bhagavan told us how to learn this knowledge from the great masters by prostrating, serving and with utmost faith in what they teach. You have to ask them questions to learn not to test them or to show that you are also knowledgeable.  

The second one is  "tatparah". which means Total devotion to what you decide to do. This is also putting our mind into what we do. Here some one needs to practice what they learned in every aspect of their life at any cost.  They can not yield to circumstances. A student in school is a perfect example who works very hard to achieve good grades. Similarly a business man eats, sleeps and stays with the same thought all the time. We just have to do the same thing if we have to experience the God.  

The last one is "Samyatendriyah" that means we have to learn to subdue the senses. While controlling the senses, we have to direct our mind towards our goal. Here important thing is to avoid distractions. The faith and devotion can not take us all the way if we do not have control on our senses. Self control is so essential in this path. Every distraction appears so reasonable and makes you believe that you are not doing anything wrong. But we will trip and lose sight of our goal. it is really essential that a seeker should learn to live in balance and steady state of sense control. renouncing the objects outwardly is not sufficient, we have to mentally renounce the objects. This is what is called as real sense control. This is possible only when we have the right view of this world and gaon right knowledge. 

These three steps are so interrelated and we can not have any gaps in any one of them. Our effort will be a failure if we can not integrate them in our practice. If everything comes together, the right knowledge is ours.  Why is it to important to gain right knowledge? Because the right knowledge will make us experience the the supreme happiness with in us. 


Lastly Bhagavaan is concluding the fourth chapter by saying the following words.

The ignorant, the faithless, doubting self goes to destruction and they will not get any kind of happiness in this world or in the other. People who perform their actions by yoga, whose doubts are rent asunder by knowledge and who is poised in the self as the self are not bound by their karmas. That is why the fourth chapter is also called as Jnaana karma sanyasa yoga.

everyday we perform actions to achieve some thing and we also accomplish so much. But we do not tend to enjoy that success. Because we worry too much about other people not recognizing us. We want to see how other people view our success. We are not able to stay in the present to enjoy our accomplishment. We will always search for negativity and suffer. If we learn to understand this principle we can develop strong faith in our practice. Then there will be less distraction in what we do. This will give us perfect formula for success. Then we can experience God.



OM SRI SAI RAM!

Tuesday, September 19, 2017

Bhagavadgita - 4.5 Jnaana Yoga- Jnaana Yagna is supreme



All the different actions (karmas) that are inline with the essence of scriptures can be defined as Yagna. There are different kinds of yagnas and they can yield different kinds of results. But all of them lead to the same goal that is towards the Brahman. Bhagavan emphasizes in the next verse that Jnaana Yagna (Knowledge sacrifice) is the best of all.


Sreyaan dravyamayaadyajnaat jnaana yagnah parantapa !
Sarvam karmaakhilam paartha jnaane  parisamaapyate !!

Superior is "Knowledge -sacrifice" to "Sacrifice with objects" O paramtapa. All actions in their entirety culminate in Knowledge.

All the material oblations such as butter, milk, curd that we use in the fire and all the community oriented good actions are called as "Dravyamayaat" (materialistic yagnas). Of all these sacrifices Knowledge about Brahman is the best. This is the essence of this verse.   

What is Jnaana Yagna?

Any knowledge that takes us closer to Brahman is called as the Jnaana Yagna. controlling the mind and senses, the practice of yoga, studying the scriptures and self analysis are the examples of Jnaana Yagna. Even the object related yagnas when performed with out expectation and with out extreme passion towards the results of those actions can be treated as superior yagnas. These actions will provide us the eligibility to get the superior knowledge. 

How do we get this superior knowledge?

Next verse describes the means to this knowledge. 

Tadviddhi pranipaatena pariprasnena sevaya ! 
Upadekstanti te jnaanam jnaaninaam tatvadarsinah !!

Know that by long prostration, by question, and service, the wise, who have realized the truth will instruct you in that knowledge.

We really have to follow the path shown by the great people of knowledge. By just praying to them outwardly for material gains is not going to help us. But we have to go deeper in the path and follow their instructions. To experience the divinity we need to possess extreme patience and utmost faith.  These are essential tools to gain that knowledge. In reality what great gurus do is take away our ignorance then the truth automatically reflects from within us.   If we gain this knowledge we will never get immersed in ignorance.  Then you can see God in everyone and can experience God within. We can cross the sea of sins with the help of a ship of knowledge. This is the assurance Bhagavan in the Gita.  The fire of knowledge will burn all the actions.  

Shirdi Sai beautifully explained about this verse to Nana Chandorkar. The great gurus take away the ignorance rather than providing knowledge. Our original nature is Knowledge that is why it is important to take away the ignorance. Our whole quest is to just getting rid of ignorance. 

In Sai Ashtottara Naamavali we recite "Hrudayagrandhi bedakayaa namah". Mundaka upanishat also says " Bidyate hrudayagrandhih chidyante sarva samsayah" whihc means once we realize God the gland of heart opens up. Then ignorance bound ego will be destroyed so that all the questions are cleared from the mind. 



Our first priority is to ask God nothing but Guru. Once we have Guru in our life then our path becomes clearer. All we need to do is to attain the eligibility for this opportunity. All our actions need to be performed with utmost faith and true knowledge. 


OM SRI SAI RAM !

భగవద్గీత 4. 5 జ్ఞాన యోగం - జ్ఞాన యజ్ఞమే శ్రేయం




పరమాత్మ ప్రాప్తికై ఆచరించబడు శాస్త్రవిహిత కర్మలన్నియు యజ్ఞమే అవుతాయి అని భగవానుడు ఇప్పటిదాకా చెప్పారు. కాని ఈ యజ్ఞాలన్నింటిలో శ్రేయమైనది ఎదో ఇప్పడు చెప్తున్నారు. 

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతపా !
సర్వం కర్మాఖిలం పార్ధ జ్ఞానే పరిసమాప్యతే !!

హే పరంతపా !   అర్జున ! ద్రవ్యమయమైన యజ్ఞముల కంటే జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నియు జ్ఞానమునందే పరిసమాప్తమగును. 

మనము యజ్ఞగుండంలో వాడే నెయ్యి, పాలు, పెరుగు, ఇంకా ఇతర వస్తువులు, దాన ధర్మములు, మనుషులకు ఉపయోగపడే కార్యములు, ఆలయములు, సత్రములు కట్టించుట మొదలైన పవిత్రకర్మలన్నియు ద్రవ్యమయమైన యజ్ఞములే. వీటికన్నా జ్ఞాన యజ్ఞమే శ్రేయమైనది అని భగవానుడు ఈ శ్లోకంలో చెప్పారు. 

అసలు జ్ఞాన యజ్ఞం అంటే ఏమిటి?

ఆత్మ సంయమము, యోగ సాధన, శాస్త్ర అధ్యయనము, తత్వ విచారము మొదలైన కర్మలన్ని జ్ఞానయజ్ఞాలుగా చెప్పబడతాయి. ద్రవ్యమయ యజ్ఞాలు కూడా మమత, ఆసక్తి, ఫలేఛ్ఛ లేకుండా జ్ఞానయుక్తంగా చేస్తే అవికూడా ముక్తికి ఉపయోగపడతాయి. 

మనము ద్రవ్యమైన యజ్ఞాలు చక్కగా ఆచరించినప్పుడు మనకు జ్ఞానం పొందే అర్హత వస్తుంది.  

సరే ఈ జ్ఞానం మనకు ఎలా వస్తుంది? 

ఈ జ్ఞానం పొందే మార్గం ఏమిటో రాబోయే శ్లోకంలో భగవానుడు చెప్తున్నారు. 

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా !
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శినః !!

తత్వమును దర్శించన వారిదగ్గరకు చేరి జ్ఞానమును గ్రహించవలను. వారికి దండ ప్రణామములు సమర్పించి, సేవ చేసి, కపటం లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతితో వారిని ప్రశ్నించి పరమాత్మ తత్వమును అనుభవ పూర్వకంగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై, నీకు ఆ పరమాత్మ తత్వమును ఉపదేశించెదరు. 

జ్ఞానులను సేవించుట అంటే వారు బాహ్యముగా పూజించటమే కాకుండా, వారు చూపించిన మార్గములో నడవాలి. వారు చెప్పిన సూత్రాలను పాటించాలి. భగవత్త్వత్వమును ఎరుగుటకు భక్తి శ్రద్ధలు సరళ స్వభావము చాలా అవసరము. ఇవి లేక పొతే జ్ఞానుల నుంచి ఆ జ్ఞానం పొందే అర్హత మనకు రాదు. ఇక్కడ నిజంగా గురువులు చేసేది మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలిగించడమే. అజ్ఞానం తొలిగిపోతే జ్ఞానం దానంతట అదే వ్యక్తం అవుతుంది. తత్వ జ్ఞానం కలిగితే మరల ఎట్టి వ్యామోహంలో చిక్కుకొనము. సమస్త ప్రాణులను నీలో సంపూర్ణంగా చూడగలవు. అప్పుడు సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు అని భగవానుడు చెప్పారు. అలానే జ్ఞాన నౌక సహాయంతో పాప సముద్రమునుండి నిస్సందేహంగా బయటపడగలవు అని గట్టిగా ఆశ్వాసన ఇస్తున్నారు. జ్ఞానమనే అగ్ని కర్మలన్నిటిని భస్మం చేస్తుంది అని కూడా భగవానుడు చెప్పారు. 

షిర్డి సాయినాధుడు పైన చెప్పిన శ్లోకం గురించి నానా చాందోర్కర్ ద్వారా మనందరికి బోధించిన సత్యం కూడా ఇదే. గురువులు అజ్ఞానాన్ని తొలిగిస్తారు అని చక్కగా చెప్పారు. ఎందుకంటే మనం స్వయంగా జ్ఞాన స్వరూపులము అని శాస్త్రాలు చెప్తాయి. అజ్ఞానమే మనకు పెద్ద అడ్డు. అది తొలిగించుకోవడానికే ఈ సాధన అంతా. 

మనము సాయి అష్టోత్తర శతనామావళిలో "హృదయ గ్రంథి భేదకాయ నమః" అని బాబాను పూజిస్తాము. ముండక ఉపనిషత్ కూడా ఈ విషయం చెప్తుంది. "భిద్యతే హృదయగ్రంధి: ఛిద్యంతే సర్వ సంశయా:" అంటే పరమాత్ముని సాక్ష్తాత్కారం అయిన వెంటనే హృదయ గ్రంథి విప్పుకొనును. మనలో జడమైన అజ్ఞాన జనితమైన ఆత్మాభిమానం వలన ఏర్పడిన సంశయములన్ని పటాపంచలైపోవును. 

అందుకే మనము మొట్ట మొదట చేయవలిసిన పని ఈ అజ్ఞానం తొలిగించగల పరమగురువులను ఆశ్రయించడమే. దీనికి కావలిసిన అర్హతను సంపాయించాల్సి ఉంటుంది. మనం ఆచరించే కర్మలన్ని భక్తితో జ్ఞానయుక్తంగా ఆచరించాలి. 




ఓం శ్రీ సాయి రామ్ !











Wednesday, September 13, 2017

భగవద్గీత 4. 4 జ్ఞాన యోగం - బ్రహ్మార్పణం



భగవానుడు కర్మలు యజ్ఞార్థమే చేయాలి అని చెప్పారు. ఇలా చేస్తే ఈ కర్మలు బంధహేతువులు కావు అని కూడా చెప్పారు. ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏ మాత్రము లేనివాడును, పరమాత్మ జ్ఞానమునందు నిరంతరము లీనమైనవాడు, కేవలము యజ్ఞార్ధమే కర్మలు నిర్వహించువాడును అగు మనుష్యుని కర్మలన్నియును పూర్తిగా విలీనములగును. మన బాధ్యతలను అనుసరించి, పరిస్థితులను అనుసరించి శాస్త్రోక్తముగా కర్తవ్యమును నిర్వర్తించటమే యజ్ఞము అంటారు. కేవలము అగ్నితో చేసేది మాత్రమే యజ్ఞము అని మనం భావించరాదు. పైన చెప్పిన విధంగా భగవంతునికి సమర్పించి, నిస్స్వార్ధంగా కర్తవ్యపరంగా చేసే ఏ కర్మ అయినా యజ్ఞమే అవుతుంది. అందుకే భగవానుడు తరువాత శ్లోకంలో ఇలా చెప్పారు. 

బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం !
బ్రహ్మ ఏవ తేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా !!

యజ్ఞ కార్యములందు వాడు వస్తువులన్నీ బ్రహ్మము. యజ్ఞములో వేసే ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞమునాచరించు కర్తయు బ్రహ్మము. హవన క్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మ కర్మయందు స్థితుడై యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే. 

అంతటా పరమాత్మే ఉన్నట్లు మన శాస్త్రాలు చెప్తాయి. అన్నింటిలో ఆ భగవంతుడే కొలువై ఉంటే ఇంక ఆ పరమాత్మ లేని స్థానం కాని, ఆ శక్తికి సంబంధించని వస్తువు కాని ఈ సృష్టిలో ఉండదు. మనం ప్రసాదంగా సమర్పించే వస్తువులన్ని ఆ భగవంతునికే చెందినవి. కేవలం సమర్పణ భావం ఉంటే చాలు.  మనం మనం చేసే కర్మ ఫలితం మీద ఆసక్తిని వదిలితే అది యజ్ఞం అవుతుంది అని చెప్పుకున్నాము. ఇది కష్టతరం అని మనం అనుకోవచ్చు, కాని ఏ పని అయినా చేసేముందు భగవంతుని తలుచుకుంటూ చేస్తే అది యజ్ఞమే అవుతుంది. భగవంతుని తలుచుకుంటే ఆ పని చేయవచ్చా లేదా అన్న విచక్షణ మనలో కలుగుతుంది. అప్పుడు మనకు తెలిసి చెడు కర్మలు జరగవు. మంచి కర్మలు కూడా మనలను బంధంలో ఇరికించవు. 

చాలా మంది భోజనం చేసేటప్పుడు పై చెప్పిన శ్లోకం తలుచుకొని అన్నం తింటారు. అప్పుడు ఈ భోజనానికి సంబంధించిన కర్మ ఫలితం అంతా భగవదర్పితం అవుతుంది. మనం తినే అన్నం బ్రహ్మము. తినే వారు బ్రహ్మము. అన్నం జీర్ణం చేసే జఠరాగ్ని బ్రహ్మమే. ఇలా సర్వం బ్రహ్మమే అన్న భావనతో యోగులు కర్మలు నిర్వర్తిస్తారు. 

మనం ఏగాగ్రతతో ఏ పని చేయాలి అనుకున్నా మనస్సు పలు దారులు పడుతుంది. సరిగా లక్ష్యంమీద దృష్టి నిలపనీయదు. మనము శ్రోత్రాది -ఇంద్రియములను సంయమనం చేయడం కూడా యజ్ఞమే అవుతుంది. మనం మమత, ఫలాసక్తి లేకుండా వివిధవ్రతములను చేయుట, ధర్మ పాలనకై కష్టములను సహించుట, మౌనము పాటించుట మొదలైనవన్ని యజ్ఞం అని పిలవబడతాయి. మన జీవనమే ఒక యజ్ఞము. పరమాత్మ భావనతో ఏ కర్మ చేసినా అది యజ్ఞమే అవుతుంది. ఇలా కర్మలు ఆచరించినప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది. అప్పుడు మనం సుఖదుఃఖాల వలయంలో చిక్కుకోము. ఈ జ్ఞానమే మనలను సత్యానికి దగ్గర చేస్తుంది. 


ఓం శ్రీ సాయి రాం !


 



    

Bhagavadgita 4.4 Jnaana Yoga - Brahmaarpanam




Bhagavan talks about undertaking actions in the spirit of divine dedication which is called as Yagna. If we perform our actions with this spirit we will not be bound by their results. A man of wisdom who is devoid of attachment, who is liberated, whose mind is established in knowledge and who acts for the sake of sacrifice, all his actions are dissolved. The Yagna is not just doing a ritual in the fire but the action which includes divine dedication. This has to be inline with scriptures and should be devoid of attachment to the fruits of action. If the actions are unselfish and done as per one's own duty then every action is considered as Yagna. Bhagavan describes in the next verse the same issue. 

Brahmaarpanam brahma havih 
Brahmaagnau brahmanaahutam !
Brahmaiva tena gantavyam 
brahma karma samaadhinaa !!

Brahman is Oblation; the oblation poured into the fire is Brahman; Brahman verily shall be reached by him who always sees Brahman in all actions.


Our scriptures say God is everywhere. The universal energy is in every particle of the universe. There will be no place where this energy is not there. whatever we offer to God belongs to the creator himself. We just need to be aware of this truth and perform our actions with a mind filled with surrender. Then each action will be Yagna. We might assume this might be difficult but if we put our mind into it we can achieve this task. when we can think about God prior to each action then we develop some kind of wisdom which will in turn give us discriminatory power. Then there will be no bad karmas. 

Lot of people recite the above verse prior to eating any food. The essence is that we are offering everything to God and the fruits of action is also surrendered to God. The food that we eat is Brahman. The person who eats is Brahman. The Jataraagni (the power that digests the food) is Brahman. This is how people of wisdom conduct themselves and live their life. 

Our mind is distracted most of the time and we can not focus on the target properly. some offer hearing and other senses as sacrifice in the fire of restraint; others offer sound and other objects of senses as sacrifice in the fire of senses. People of wisdom live in the life constantly offering their senses into the fire of self-control, so that the senses, of their own accord burnt up, contributing greater freedom and joy. All this constitutes and can be called as real Yagna. It is wise to follow this path of sense control and the path of mind control. Our life itself is Yagna. When this course is followed there evolves the path of wisdom. This will lead us to the goal of life which is reaching God and understanding that we are one with God. 


OM SRI SAIRAM!

Wednesday, September 6, 2017

భగవద్గీత 4. 3 జ్ఞాన యోగం - కర్మ - అకర్మ - వికర్మ



భగవానుడు నాలుగు వర్ణాలను వారికర్మల ఆధారంగా సృష్టించాను అని చెప్పి మరల నేను అకర్తను అని కూడా చెప్పారు.  ఆ శ్లోకం ఒక్కసారి పరిశీలిద్దాము.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః !
తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారమ్ అవ్యయం !!

బ్రాహ్మణ, క్షత్త్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణ కర్మలను బట్టి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను, శాశ్వతుడను పరమేశ్వరుడను ఐన నన్ను అకర్తగా తెలుసుకొనుము.

వారి వాసనలు, గుణములననుసరించి వారి వర్ణములు నిర్ణయించ బడతాయి అని భగవానుడు చెప్పారు. మనకు కాలం కలిసిరాకపోతే, మనం కష్టాలలో మునిగిపోతూ ఉంటే,  దేవుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడు? నాకే ఇలా ఎందుకు జరగాలి? అని రక రకాలుగా దేవుడ్ని తప్పు పడతాము. కొంత మంది అసలు దేవుడు అనే వాడు ఉంటే ఇలా ఎందుకు జరగనిస్తాడు అని నిందలు వేస్తాము. మనం ఎలాంటి కుటుంబంలో పుట్టాలో, ఏ వృత్తి మన జీవనం అవుతుందో అన్న ప్రశ్నలకు సమాధానం గుణాల ఆధారంగానే చెప్పగలుగుతాము.

ఒక జడ్జిగారు ఒక ముద్దాయికి శిక్ష వేయడం జరిగింది. రాజ్యాంగం ప్రకారం ఆ నేరానికి తగిన శిక్ష ఎదో ఎప్పుడో వ్రాయబడింది. అక్కడ ఉన్న దానిని ఈ జడ్జి అమలు చేయడం జరిగింది. కాని జడ్జి ఇక్కడ కర్తగా ఉన్నా అకర్తే. అలానే భగవంతుడు కూడా అన్ని చేస్తున్నట్లు ఉన్నా అకర్తగానే పరిగణించబడింది. మనిషి తాను చేసుకున్న కర్మల ఆధారంగా అన్ని జరుగుతూ ఉంటాయి. ఇదే తత్వాన్ని ముముక్షువులు అర్ధం చేసుకొని కర్మలను ఆచరిస్తారు. అందుకే వారికి ఏ కర్మలు అంటవు అని భగవానుడు చెప్పారు.

కర్మ అంటే శాస్త్ర విహిత కర్తవ్యము. 

మనోవాక్కాయములచే చేయబడు క్రియలను భౌతికముగా త్యజించడమే అకర్మ అని మనం అనుకోవచ్చు కాని శాస్త్రంలో చెప్పిన విధంగా చేయక పోవడమే అకర్మ.  

శాస్త్ర నిషిద్ధ కర్మలే వికర్మలు.  

మనం చేసే కర్మల వెనక ఉన్న ఉద్దేశం మంచిగా ఉండటం చాలా అవసరం. ఎవరైతే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తారో వారే బుద్ధిమంతులు.



ఓం శ్రీ సాయి రామ్ !