భగవానుడు
నాలుగు వర్ణాలను వారికర్మల ఆధారంగా సృష్టించాను అని చెప్పి మరల నేను అకర్తను అని
కూడా చెప్పారు. ఆ శ్లోకం ఒక్కసారి పరిశీలిద్దాము.
చాతుర్వర్ణ్యం
మయా సృష్టం గుణకర్మ విభాగసః !
తస్య
కర్తారమపి మాం విద్ధి అకర్తారమ్ అవ్యయం !!
బ్రాహ్మణ,
క్షత్త్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణ కర్మలను బట్టి వేర్వేరుగా
సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను, శాశ్వతుడను పరమేశ్వరుడను
ఐన నన్ను అకర్తగా తెలుసుకొనుము.
వారి
వాసనలు, గుణములననుసరించి వారి వర్ణములు నిర్ణయించ బడతాయి అని భగవానుడు చెప్పారు.
మనకు కాలం కలిసిరాకపోతే, మనం కష్టాలలో మునిగిపోతూ ఉంటే, దేవుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడు? నాకే ఇలా ఎందుకు జరగాలి? అని
రక రకాలుగా దేవుడ్ని తప్పు పడతాము. కొంత మంది అసలు దేవుడు అనే వాడు ఉంటే ఇలా
ఎందుకు జరగనిస్తాడు అని నిందలు వేస్తాము. మనం ఎలాంటి కుటుంబంలో పుట్టాలో, ఏ వృత్తి
మన జీవనం అవుతుందో అన్న ప్రశ్నలకు సమాధానం గుణాల ఆధారంగానే
చెప్పగలుగుతాము.
ఒక
జడ్జిగారు ఒక ముద్దాయికి శిక్ష వేయడం జరిగింది. రాజ్యాంగం
ప్రకారం ఆ నేరానికి తగిన శిక్ష ఎదో ఎప్పుడో వ్రాయబడింది. అక్కడ ఉన్న దానిని ఈ
జడ్జి అమలు చేయడం జరిగింది. కాని జడ్జి ఇక్కడ కర్తగా ఉన్నా అకర్తే. అలానే భగవంతుడు
కూడా అన్ని చేస్తున్నట్లు ఉన్నా అకర్తగానే పరిగణించబడింది. మనిషి తాను చేసుకున్న
కర్మల ఆధారంగా అన్ని జరుగుతూ ఉంటాయి. ఇదే తత్వాన్ని ముముక్షువులు అర్ధం చేసుకొని
కర్మలను ఆచరిస్తారు. అందుకే వారికి ఏ కర్మలు అంటవు అని భగవానుడు చెప్పారు.
కర్మ
అంటే శాస్త్ర విహిత కర్తవ్యము.
మనోవాక్కాయములచే
చేయబడు క్రియలను భౌతికముగా త్యజించడమే అకర్మ అని మనం అనుకోవచ్చు కాని శాస్త్రంలో
చెప్పిన విధంగా చేయక పోవడమే అకర్మ.
శాస్త్ర
నిషిద్ధ కర్మలే వికర్మలు.
మనం చేసే
కర్మల వెనక ఉన్న ఉద్దేశం మంచిగా ఉండటం చాలా అవసరం. ఎవరైతే కర్మలో అకర్మను, అకర్మలో
కర్మను చూస్తారో వారే బుద్ధిమంతులు.
ఓం శ్రీ
సాయి రామ్ !
No comments:
Post a Comment