In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, November 29, 2017

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 9



ఈ అధ్యాయంలో షిర్డీకి వచ్చిన యాత్రికులు బాబా అనుమతి లేకుండా వెళ్తే పడిన కష్టాలు, అలానే ఒక సారి ఆజ్ఞ అయిన తరువాత షిర్డీలో ఒక్క క్షణం ఉన్నా కలిగే ఇబ్బందుల గురించి హేమద్పంత్ చెప్పడం జరిగింది. ఇలా చాలామందికి అనుభవపూర్వకంగా తెలియడం మూలానా బాబా ఆజ్ఞను తప్పకుండా పాటించేవారు. రొట్టె తినివెళ్లండని బాబా చెప్పగా ఎవరైనా తినకుండా వెళ్తే వారికి బండి దొరకక ఉపవాసంతో మాడిపోయేవారు. దీనిని అనేకమంది భక్తులు గ్రహించారు. ఒక సారి తాత్యా కోతే పాటిల్ కోపర్గాంలో ప్రతివారం జరిగే సంతకు బయల్దేరి మసీదుకు వచ్చాడు. టాంగాను బయట నిలిపి బాబా దర్శనం చేసుకొని బాబా అనుమతిని తీసుకునే వంకతో వెళ్లివస్తానంటూ బాబాకు వందనం చేసాడు. తాత్యా తొందరపాటును చూసి కొంచెం ఆగు అని అన్నారు.

అవసరమైతే శ్యామాను వెంట తీసుకువెళ్ళు అని చెప్పారు. కాని తాత్యా ఒంటరిగానే వెళ్లి నడుము పట్టేట్లు చేసుకున్నాడు. ఇంకోసారి ఇలానే బాబా వద్దన్నా వెళ్లి టాంగా ప్రమాదంలో ఇరుక్కుంటాడు. ఇలాంటి సంఘటనే ఒక ఐరోపా దేశస్థుడుకి కూడా జరుగుతుంది.  ఆయన బాబా దగ్గరకు వచ్చి పాదాలకు వందనం చేసుకోవాలని అనుకుంటాడు. కాని ఆయనను ద్వారకామాయి మెట్లు ఎక్కనివ్వరు. బయటనుంచి దర్శనం చేసుకోమంటారు. అతను తిరిగివెళ్ళడానికి నిశ్చయించుకొని అనుకోగా, బాబా ఇప్పుడు వద్దు అని చెప్తారు. ఆయన వినకుండా బయలుదేరతారు. తరువాత ఆయన టాంగా పట్టుతప్పి దెబ్బలతో ఆసుపత్రి పాలవుతారు.  ఇలా లెక్కలేనన్ని అనుభవాలు కలుగగా ఎవరుకూడా బాబా మాట జవదాటడానికి సంకోచించేవారు.  బాబా ఆజ్ఞను శిరసావహించినవారు, వేళకాని వేళా కూడా రైలును అందుకొని సుఖంగా ప్రయాణం చేసి దానిని జీవితాంతం గుర్తు ఉంచుకొనే వారు. 


తరువాత హేమద్పంత్ గారు బాబా భిక్షావృత్తిని సంవత్సారాల తరబడి ఎందుకు చేసేవారు అన్న విషయం గురించి చెప్పారు. గృహస్థులుగా ఉన్నవారు అన్నం వండుకొని మొట్టమొదటగా యతులకు, బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. అప్పుడు మాత్రమే వారు స్వీకరించాలి. బాబా గృహస్థులు కారు. వారు ఒక ఫకీరులా జీవనం సాగించారు. ఈషణ త్రయాలు లేనివారు భిక్షకు అర్హులు. ఈషణ త్ర్యయం అంటే సంతానం పైన, ధనం పైన మరియు లోకంపైనా ఉన్న మోహాలు. ఈ మోహాలే మనలను బాధలకు గురిచేస్తాయి.  మనం ఆహరం తయారు చేసేటప్పుడు చాలా ప్రాణులు చనిపోతాయి. చాలామంది కష్టపడితే కాని ఈ ఆహారం మన దాకా రాలేదు. ఈ రకంగా వచ్చే పాపాలను పంచ సూనాలు అంటారు. వీటినుంచి తప్పించుకోవాలి అంటే మనం పంచ మహా యజ్ఞాలు అనేవి చేయాలి. ఈ పంచమహాయజ్ఞాలలో ఒకటి అయిన అతిధి యజ్ఞం భిక్ష ద్వారా బాబా చేయించారు. బాబా ఐదు ఇళ్లలో రోజు భిక్ష తీసుకొనే వారు. అలానే దక్షిణ రూపంలో అందరి దగ్గరినుంచి పాపాలను పోగెట్టే వారు. ఇలా ఇంటి దిగారు ఉండి బాబాకు భిక్ష ఇచ్చినవారు ఎంతో పుణ్యాత్ములు.  ఈ ఆహరం మనం స్వీకరించే ముందు భగవంతునికి సమర్పించడం కూడా అందుకే. అలా సమ్పర్పిస్తే దాని ద్వారా వచ్చే పంచ సూనాల నుంచి మనం విముక్తి పొందుతాము అని బాబా మనకు నేర్పిస్తున్నారు. 



ఇప్పుడు పంచమహా యజ్ఞాలు ఏమిటో చూద్దాము. 


బ్రహ్మ యజ్ఞము - వేదాలను, మన శాస్త్రాలను పారాయణ చేయడమే బ్రహ్మ యజ్ఞము. 


పితృ యజ్ఞము - పితృ దేవతలకు ఇచ్చే ప్రసాదం. 


దేవ  యజ్ఞము - దేవతలకు నైవేద్యం  ఇవ్వడం. 


భూత యజ్ఞము - సర్వ జీవులకు ఆహరం సమర్పించడం.  


అతిధి యజ్ఞము - మనం ఆహ్వానించని అతిధులకు ఆహరం పెట్టడం.  


మనం దేవుడికి సమర్పించేవి నిజంగా దేవుడు తీసుకుంటాడా అని కొంతమందికి సందేహం ఉండచ్చు. బాబా ఎన్నోసార్లు తనకు సమర్పించినవి స్వీకరించినట్లు చూపించడం జరిగింది. మనసులో కేవలం ప్రేమ ఉంటే చాలు. ఎవరితోనైనా బాబాకు ఏదైనా పంపితే, తెచ్చినవారు మర్చిపోయినా బాబా అడగడం మర్చిపోయేవారు కారు. రొట్టె, కూర, పాలకోవా కాని దృఢమైన భక్తితో ఇవ్వాలి. అలాంటి భక్తులు తటస్థ పడితే బాబాకు ప్రేమ ఉప్పొంగేది. అలాంటి కుటుంబం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. బాబా సాహెబ్ తర్ఖడ్ బాబాను అమితంగా ప్రేమించేవాడు. అతను బాబా యొక్క చిత్రపటాన్ని చందన మండపంలో ఉంచి రోజూ త్రికాల పూజలు చేసేవాడు. రోజు నైవేద్యం ఉంచేవాడు. ఒకసారి తన తల్లితో కలిసి షిర్డీ రావాల్సి వస్తుంది. తండ్రి బాబాకు పూజ చేసి నైవేద్యం పెడతాను అని భరోసా ఇస్తే అప్పుడు షిర్డీకి వెళ్తాడు. తండ్రి చక్కగా పూజ చేసి నైవేద్యం పెట్టేవాడు కాని ఒక రోజు నైవేద్యం పెట్టడం మర్చిపోతాడు. తన తప్పు తెలుసుకొని బాబాను క్షమించమని కోరతాడు. తరువాత తన కొడుకుకి ఉత్తరం రాస్తారు.


అదే సమయానికి బాబా తన తల్లితో ఇలా అంటారు. "తల్లీ ! ప్రతిరోజులాగే నేను ఈ రోజూ బాంద్రాకు వెళ్ళాను. తినడానికి త్రాగడానికి ఏమి లేక నేను ఉపవాసంతో తిరిగిరావాల్సి వచ్చింది" అని బాబా అంటే కొడుకుకి ఎదో తప్పు జరిగిపోయిందని అర్ధం అయ్యింది. వెంటనే బాబా అన్న మాటలను ఉత్తరం రూపంలో తన తండ్రికి రాసాడు. ఇలా ఇద్దరి ఉత్తరాలు ఒకరినొకరికి చేరాయి. కొడుకు వెంటనే వెళ్లి మళ్ళి ఈ తప్పు జరగకుండా చూసుకోవాలి అనుకున్నాడు. కాని బాబా షిర్డీలోనే ఉండి పూజ చేయమన్నారు. అలానే తన తల్లి కూడా ఒక రోజు ఆకలిగొన్న కుక్కకు, పందికి రొట్టె ముక్క పెడుతుంది. బాబా అప్పుడు ఆమెను చూసి ఎలా అన్నారు. "అమ్మా! ఈ రోజు నువ్వు నాకు తిండి పెట్టావు. కడుపు నిండింది, గొంతువరకు తిన్నాను. రోజూ ఇలాగే చేస్తూ ఉండు. నిజంగా పనికి వచ్చేది ఇదే అని చెప్పారు.  ఆమెకు మొట్టమొదట ఏమి అర్ధం కాదు. నేనేంటి బాబాకు అన్నం పెట్టడం ఏమిటి అని అనుకుంటుంది. అప్పుడు బాబా కుక్కకు రొట్టె పెట్టిన సంగతి గుర్తు చేస్తారు. ఇదే భూత యజ్ఞము. 
  
 బాబా ఎప్పుడు తన భక్తుల అభిష్టం మేరకు అన్ని చేస్తారు. వారు ఎలా కోరుకుంటే అలా చేసి చూపిస్తారు. ఈ అధ్యాయంలో వంకాయ వేపుడు తినాలి అని బాబా అడిగి భక్తురాలి కోరికను తీరుస్తారు. తర్ఖడ్ భార్య గోవిందజీ అనే అబ్బాయితో పాలకోవా పంపిస్తుంది. కాని ఆ అబ్బాయి మర్చిపోయినా బాబా అడిగి మరి తీసుకుంటారు. 

మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం బాబా సర్వజ్ఞులు. ఎవరిమనసులో ఏ భావం ఉంటె దానికి అనుగుణంగా అనుభవాలు కలుగచేసి భక్తుల గౌరవాన్ని నిలబెట్టేవారు అని హేమద్పంత్ చెప్తారు. సర్వ జీవులలోను భగవంతుడిని చూడాలి అని బాబా మనకు నేర్పిస్తున్నారు.  ఇదే సర్వమతాలు బోధించే సత్యం. మనం సమర్పించే నైవేద్యం తప్పకుండా బాబా స్వీకరిస్తారు అని గ్రహించాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే; బాబా సర్వాంతర్యామి. ఎలాగైతే ఒక జీవి స్వీకరిస్తే తాను తీసుకున్నట్లు బాబా చెప్తారో, అలానే బాబాకి నైవేద్యం ఇస్తే సర్వ జీవులకు అన్నం పెట్టినట్లే అని మనం తెలుసుకోవాలి. కేవలం మన కోరికల కోసమే నైవేద్యం పెట్టడం కాకుండా అన్ని జీవులకు ఆహరం బాబా ఇవ్వాలి అని మనం కోరుకోవాలి. 

  




 శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు !



Sri SaiSatcharita Chapter – 9




 
In this this chapter Hemadpanth describes how the devotees faced troubles when they insisted on returning to their destinations without Baba’s permission. Sometimes he wanted them to leave the Shirdi and if they did not, they got in trouble. So they believed that the best thing to do is to obey Baba’s orders. He knew which train will be late and where the thieves will cause trouble. Tatya Kote Patil once wanted to go to Kopergaon where the weekly bazaar was held. On the way, he came to the Masjid to take a glimpse of Baba, bowed at his feet and pretended to ask for permission to leave. The devotee may try to evade, but Baba knows what is in the devotee’s mind. Seeing that Tatya was in a hurry, he asked him to wait for a while. Baba said “Let the bazaar take place! Don’t
leave the village”. But seeing that Tatya was very keen, he asked him to take Shama along. But Tatya goes alone and gets in trouble. Similar incident happened with a European gentleman. He wanted to see Baba and get his blessings. But Baba won’t let him come inside Dwarakamai and asked him to stay in the front court yard. Feeling rejected this gentleman leaves against Baba’s wish. He gets into an accident and hospitalized. There were many such instances. People began to have fear and apprehension. They began to obey Baba’s wishes. In some cases the wheels of the carriage came off; in some cases the horses got tired; in other cases they missed their trains, remained hungry and had to survive on puffed rice. On the contrary, those who respected his wishes were able to catch the trains even at odd times. They had a pleasant journey and remembered it throughout their life.


Hemadpanth then talks about how a household needs to serve the saints and how Baba went around for alms. He wanted to take away the sins related to Panchasoonas (Sins that are committed when preparing the food). The one who surrenders body- speech- mind and wealth at Sai’s feet, such a devotee is deeply loved by Sai. Without the five sacrifices, the householder is advised against eating the food. Every day he would go to five houses and remind the
hosts about the Attithi Yagna. So the persons were really fortunate who could sit at home and earn the ‘punya’.  Those people, who after performing the ‘panchmaha yagnas,’ ate the remaining food, were saved from the terrible and unknown five sins, because the sins were burnt. These five sins are the result of everyday activities and in preparing the food. In order to be free from these five sins, a householder has to perform these five ‘maha yagnas’, after which the sins are destroyed and attain purity.


Brahma Yagna is reciting of Vedas; 

Pitru Yagna offering food by encircling with water;

Dev Yagna offering food to the deities;



Bhoota Yagna offering food to all creatures.


Attithi Yagna Offering food to an uninvited guest who may come to the doorstep.



Baba gave simple solution to get rid of these sins and that is to offer to God first before we eat anything.


 Sometimes people wonder whether God accepts the offerings that we offer during the puja. Baba proved so many times that he accepts from every devotee when they offer anything. Babasaheb Tarkhad story is one such incident where Baba proves this. Once Atmaram sends his son and wife to see Baba, The son was worried that his daily worship of Baba will be interrupted. Then Atma ram reassures his son saying he will take care of puja and prasad like his son.
Atmaram does not do idol worship but agrees to perform puja for Baba. He does the puja and prasad everyday similar to his son. But one day he forgot to keep Prasad. Then Baba tells his wife that he could not find any food when he went to their house. Then the son understood that some mistake could have happened. Father also realized and asked for Baba’s forgiveness. Atmaram writes a letter to son about this mistake. At the same time son sends a letter to his father about what Baba said. Baba blessed his whole family.  


Once Mrs. Tarkhad fed a dog and a pig while she was about to eat. Then Baba told her “Oh mother you fed me today and you satisfied my hunger”. Baba encouraged her to be like that. This is nothing but Bhoota Yagna. Baba also said “Know that this is the kindness which I preach. Give food to the hungry first and then eat yourself. Remember this clearly in your mind”.  First she could not understand what Baba was saying and Baba had to explain her how she fed those animals. The lady was very much surprised. Baba fulfils the wishes of each and every one of his devotees. If they wished to offer Baba anything, he made sure that he got those items from them. This chapter describes such incidents with Tarkhad’s wife by asking for Brinjal and when she sent Peda (sweet) with person named Govindji. The essence of these stories is that one should perceive God in all living beings. This is also acknowledged by all the Shashtras. We also have to realize that God accepts our offerings if we can offer them with pure devotion.





Sri Sainathaarpanamasthu!










Tuesday, November 21, 2017

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 8



మన జీవితం సగం నిద్రతోనే సరిపోతుంది. ప్రతిరోజూ ఉదయాస్తమానాలు అవుతాయి. ఆలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి. మిగిలిన జీవితాన్నైనా సరిగ్గా అనుభవించరు. బాల్యంలో క్రీడలు, వయసులో సుఖభోగాలకై పరుగులు మరియు వృద్ధాప్యంలో వ్యాధిగ్రస్తులై పీడింపబడతారు. శరీర పోషణ మరియు మైథునం ఇవే మానవ శరీరానికి సాధనాలైతే, ఈ జన్మకు పర్యవసానం ఇదే అయితే ఈ నర జన్మ వ్యర్థం అని మన శాస్త్రాలు చెప్తాయి. మనం ఎవరము, ఎక్కడినుండి వచ్చాము ? ఈ మానవ జన్మకు కారణం ఏమిటి ? అన్న రహస్యం అర్ధం చేసుకున్నవారు వివేకవంతులు. బాల్యం, యవ్వనం, వార్ధక్య అవస్థలు జనులందరికి ఉంటాయి.  కాని అవి ఎలా వచ్చి వెళ్ళిపోతాయో ఎవరు తెలుసుకోలేరు. కళ్ళకు కన్పించేది ఏదైనా నశించేదే. ఈ క్షణంలో ఉన్న శరీరం తరువాత ఉండదు. శరీరం మలమూత్రాలు, శ్లేష్మం చీము రక్తాలతో నిండి ఉంటుంది. దీనిని ప్రతీ క్షణం మృత్యువు వెంటాడుతు ఉంటుంది. ఇలాంటి ఈ శరీరమే మనకు పరమేశ్వర ప్రాప్తిని కూడా కలుగచేస్తుంది. క్షణభంగురమైన ఈ శరీరం పుణ్యం సంపాయించే భగవద్ ఆరాధన, శ్లోకాలు, భగవంతుని కథలు వినే సమయమే సార్ధకం అవుతుంది. పరమేశ్వరుని దయతో మనకు కావలసినవన్నీ వచ్చినా ఇంకా మనలో అశాంతే ఉంటుంది. శాశ్వతమైన పరమపదం పొందిన దాకా నిజమైన శాంతి దొరకదు. జీవించడానికి సరిపడా అన్న వస్త్రాలు, తగుమాత్రం ఆలన పాలన చేసి, జనన మరణాలను తప్పించుకోవడమే మానవ కర్తవ్యం అని ఈ అధ్యాయం మనకు చెప్తుంది.


బాబా అందుకే ఈ శరీరాన్ని ఒక అద్దె ఇల్లులాగా చూసుకోమని చెప్పారు. ఇక్కడ ఉన్నంత వరకు దీనిని శుభ్రంగా ఉంచుకొని పరమార్ధం చేరుకోవడానికి తగినంతగా వాడుకొవాలి. మనం ఎన్నో జీవరాశులుగా జన్మలు తీసుకొన్న తరువాత కాని మనకు మానవ జన్మ రాలేదు అని శాస్త్రాలు చెప్తాయి. భగవంతుని పొందే అవకాశాన్ని ఈ జన్మలోనే దక్కించుకునే ప్రయత్నం చేయాలి. మరు జన్మకై ఎదురుచూడకూడదు. ఎందుకంటే మళ్ళా మానవ జన్మ ఎప్పుడు వస్తుందో? అందుకే శంకరాచార్యులవారు "జంతూనాం నరజన్మ దుర్లభం" అని చెప్పారు. మన కర్తవ్యం ఏమిటో చక్కగా అర్ధం చేసుకోవాలి. మనం జీవితం అనే అరణ్యంలో ఎంత పరుగులు తీసినా దైవాన్ని మరువకూడదు. పరమార్ధాన్ని బోధించే శాస్త్రాలను పారాయణ చేయాలి. సత్సంగం చేయాలి. గురువులను ఆశ్రయించాలి. శరీరం పట్ల అంతులేని వ్యామోహం వదలాలి. గురువుల పట్ల శ్రద్ధను పెంచుకోవాలి. ఈ జీవితం క్షణభంగురం. ఎప్పుడు రాలిపోతుందో తెలియదు.  కాలుడు తనపని తాను చేసుకుంటూ పోతాడు. అప్పుడు నాకు ఒక్కరోజు ఎక్కువ ఉంటే బాగుండు అనే బేరసారాలు ఉండవు. ప్రతిక్షణం ఈ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ శరీరంలో ఉన్నంత కాలం ఈ సాధన జరుగుతూ ఉండాలి.

అబేధ జ్ఞానమే తత్త్వం. ఉపనిషత్తులలో ఉన్న బ్రహ్మజ్ఞానం ఇదే. పరమాత్మ ఉపాసన అన్నా ఇదే. భక్తులు భగవంతుడు అన్నా ఇదే. గురువు బ్రహ్మము వేరు కాదన్న అభేదజ్ఞానం కలగడమే భక్తి. ఈ భక్తితో మాయను దాటటం సులభం. యోగ్యులు శ్రద్ధ కలిగిన వివేకవంతులు జ్ఞాన వైరాగ్యాలను సంపాయించుకుంటారు. ఈ ఆత్మా తత్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు. సాయి మనకు గురువు. ముల్లుని ముల్లుతోనే తీసివేసినట్లు, అజ్ఞానమనే ముల్లును జ్ఞానమనే ముల్లుతోనే తీయాలి. నేను నాది అనేది పోయినదాకా జ్ఞానజ్యోతి తన ప్రకాశం వ్యక్తం చేయదు. సాయి చూపించిన దారిలో నడిస్తే ఈ జ్యోతి తొందరగా వెలుగుతుంది.


 ఈ అధ్యాయంలో బాబా భిక్ష గురించి హేమద్పంత్ ఈ విధంగా వ్రాసారు. ఒక చేతిలో రేకు డబ్బా, రెండవ చేతిలో జోలి తగిలించుకొని, ప్రతిరోజు నియమంగా కొన్ని ఇళ్లకు వెళ్లే వారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ వంటి పలుచని పదార్ధాలు రేకు డబ్బాలో పోయించుకునే వారు. రొట్టె అన్నమును జోలిలో వేయించుకునే వారు. వారి జిహ్వకు రుచిని గ్రహించాలి అన్న ఆశ లేదు. ఇలా తెచ్చిన వాటిని మసీదులోని ఒక మట్టి పాత్రలో ఉంచేవారు. కాకులు, కుక్కలు అందులోనే తింటున్నా ఎప్పుడు వాటిని తరిమేవారు కారు. అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అన్నం రొట్టెలు తీసుకు పోయేది. బాబాకు అందరు సమానమే. బాబా మసీదుకు రాకముందు తాత్యా తల్లి బాయజాబాయి బాబా కోసమని రొట్టెల బుట్టను తలపై ఉంచుకొని అడవిలోకి వెళ్ళేది. మైళ్ళు నడచి బాబా ఎక్కడ ఉన్నా వెతికి ఆహారం తినిపించేది. తరువాత బాబా మసీదుకు వచ్చిన తరువాత ఆమెకు తిరిగే అవసరం లేకుండా పోయింది. బాబానే భిక్షకు వచ్చేవారు. ఆమె ఏమి ఆశించకుండా ఈ సేవ చేయడం జరిగింది. కాని బాబా తరువాత తాత్యాను కనిపెట్టుకొని ఉన్నారు. 

తాత్యా, మహల్సాపతి బాబాతో పాటు మసీదులో కొన్నిఏళ్ల పాటు నిద్రించడం వాళ్ళ పూర్వ జన్మ పుణ్యం. వారు ఉత్తరం, తూర్పు మరియు పడమరగా తమ తలలు పెట్టి పాడుకొనే వారు. తాత్యా కనుక కునుకు పెడితే బాబా తన తలను గట్టిగా వత్తిమరీ నిద్ర లేపే వారు. ఈ విధంగా తాత్యా 14 సంవత్సరాలు బాబాతో నిద్రించడం జరిగింది. తరువాత కాలంలో తన తండ్రి చనిపోతే ఇంట్లోనే నిద్రించేవాడు. తాత్యా, మహల్సాపతి ఎంతటి అదృష్టవంతులో చెప్పనక్కరలేదు. అలానే మనం కూడా అజ్ఞానమనే నిద్రలో ఉంటె మన తలకూడా వత్తి జ్ఞానం వైపు తీసుకువెళతారు. ఇక్కడ నిద్రపోవడం అంటే ఆధ్యాత్మిక పధంనుంచి పక్కకు పోవడం. మనలను సరిఅయిన దారిలో పెట్టి అనుగ్రహిస్తారు. 

ఇంకా చివరగా ఈ అధ్యాయంలో రహతా నివాసి అయిన ఖుశాల్ చంద్ అనే ఆయనను బాబా ఎంతో ప్రేమగా చూసే వారు. ఆయనకు కూడా బాబా అంటే అంతే ప్రేమ భక్తి ఉండేవి. బాబా రహతా పొలిమేరలకు రాగానే డోలు సన్నాయి మొదలగు వాద్యాలతో బాబాకు ఆహ్వానం పలికే వారు. మనం కూడా అంత ప్రేమ చూపిస్తే బాబా మన హృదయం అనే రహతాకు వస్తారు. మనతో ముచ్చటించి, మన ఆతిధ్యం స్వీకరించి మనలను అనుగ్రహిస్తారు.

ఈ అధ్యాయం మొత్తం ఒక సారి పరిశీలిస్తే కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొట్ట మొదటగా మానవ జీవితం ఎంత విలువైనదో చెప్పారు. మనం ఏంతో పుణ్యం చేసుకుంటే కాని ఈ జన్మ రాదు. తరువాత గురువు యొక్క ఆవశ్యకత చెప్పారు. గురువు భిక్షను స్వీకరించి మన పాపాలను పోగొడతారు. తరువాత బాయజాబాయి సేవ గురించి చెప్పారు. అంటే గురు సేవ నిస్వార్ధంగా ఉండాలి. అప్పుడే మనకు గురువుతో సత్సంగం దొరుకుతుంది. అంటే తాత్యా, మహల్సాపతి లాగా బాబాతో ఉండటం. గురువు మన జీవితంలో ఉంటె మనం ఆధ్యాత్మిక పధంలో సులభంగా నడవగలుగుతాము. మనం విషయ వస్తువుల వైపు పరుగులు తీస్తే ఈ ప్రయాణం ఆలస్యం అవుతుంది. మళ్ళా మనకు మానవ జన్మ వస్తుంది అన్న నమ్మకం లేదు. అందుకే మనం బాబా చెప్పిన దారిలో నడిచి బాబాకు దగ్గర అవ్వాలి. అప్పుడే మనం మన గమ్యం చేరుకోగలుగుతాము. 
  



శ్రీ సాయినాథార్పణమస్తు !

Sri Saisatcharita chapter - 8



Every day the sun rises and the sun sets. Thus the years roll on. Half of life is spent in sleep and the remaining is not enjoyed peacefully. As children our life is mostly spent in fun activities and lot of school education. Then we are running for worldly pleasures and when we become old all kinds of ailments bother us. Childhood, youth and old age are the stages through which everybody goes; but how naturally they come and go is not understood by anybody. We spend almost half of our life in sleep and rest of the time we do not even enjoy what we have. The human body is the home of germs and viruses, harbors various diseases, not long-lasting and ends within a short period. It is an accumulation of flesh and muscles, the cage or skeleton of bones and skin. But still this body is the only way through which purity of God can be reached. The cycle of birth and death is continuous. Even the very idea of death is extremely horrifying. This life will pass away without any inkling. This is the essence of human life and we are not born just for this reason. This is the point that was emphasized in the beginning of the chapter 8.



Baba told us about the significance of human life and what is the goal of human life. In case of such short-lived human life, the time which is spent in reading the scriptures and listening to the stories of God is fruitful, while the time spent otherwise is a waste. This is the best thing to do in our life but nobody can own this feeling until they make a deep study of life and experiences this one self. One should keep permanent peace and happiness as one’s goal of life and think about it. Serve all beings as God – this is the most beneficial faith in life. Baba says to leave the attachment to the body but protect enough to live, do not pamper. Life passes quickly in looking after the progress of the family. But time never forgets its duty and readily keeps count of the tenure of life. A person gets human birth because of past good deeds and after so many animate and inanimate births. Therefore, every moment should be used well. Life is not to be lived only for doing work, to fulfil one’s wishes to acquire wealth and for earning money. Until one survives, one should study the philosophy of life. That is the aim of life.


The knowledge of reality is oneness. That is also the knowledge of Brahman, as prescribed by the Upanishads. That is itself the worship of God. That is the real God for the devotees. Guru and Brahman are not two separate entities. Remove ignorance through knowledge. Go beyond both knowledge and ignorance. Reach the stage of Pure Self-realization. This is the only goal for a human life. To reach this we need a Guru in our life. Sai is our Guru. The salt water from the sea evaporates and comes as the rain water which is potable. Similar is the happiness of being at the feet of Sai.


In this chapter Hemadpanth writes about how Baba went for Bhiksha (alms) every day. He was using a cloth like Jholi to put rice and bread. Then he also had a Tumrel in which he gets vegetables, curry, buttermilk and all kinds of liquid items. His tongue has never known passion for taste. He used to leave the food in Kolamba so that dogs, birds and other animals can eat this food. Initially Bayjabai used to search for Baba to feed him but later on when Baba settled in Masjid her task became easier. But she worked hard to serve him with full joy. She did this service without expecting anything in return. Of course Baba will help us anyway. By taking alms Baba took away our sins so that we can be free from the negative deeds. Then Hemadpanth talks about how Tatya, Mhalsapati and Baba used to sleep in the Masjid with their heads toward North, East and West. If Tatya doze off, Baba used to press his head and wake him up. This went on for 14 years for Tatya and when his father died Tatya started sleeping at home. This was incredible to be with Baba all these years. Baba wakes us if we doze off from God by pressing our heads also. Baba will make sure we walk in right path. Here sleeping means deviating from spiritual path.


Later in the chapter Satcharita talks about how Baba blessed Kushalchand in Rahata. Baba never went beyond Shirdi except Rahata and Neemgaon. When he goes there people used to welcome him with so much devotion. Now let us look at the whole chapter and the sequence of stories that were told. First it talks about the importance of human life and goal of life. So we are born on this earth after doing some good deeds. Then it tells you how to use time and what we need to do. By taking alms, Baba took away sins from his devotees. Then bayjabai serving Baba was mentioned which means we have to serve our Guru or God with lots of devotion without expecting anything in return. We have to love God for God only. Not for anything else. By doing this our hearts will be pure. Then only we will be eligible for Satsangh with Guru. This is like Tatya and Mhalsapati staying with Baba. Once we have Satsangh and Guru in our life, then comes the grace from God. Baba will show us the right path only if we let him. If we keep running for worldly objects then our spiritual quest will be delayed. We may not be sure that we will get human form in the next life. So Sai devotees let us walk the path that Sai showed and ask Sai to give us the strength to do so.



Sri Sainathaarpanamasthu!  

Wednesday, November 15, 2017

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 7



సాయి సర్వాంతర్యామి. వారు పరమగురువులు. భక్తుల హృదయాలలో ఏముందో తెలుసుకోవడమే కాకుండా వారి పూర్వ జన్మ వాసనలను బట్టి వారికి ఏమి చేస్తే మంచిదో అది మాత్రమే చేసే వారు. బాబా భక్తుల జీవితంలో ఒక భాగమై వారి జీవితంలో వచ్చే ఒడిదుడుకులను సరిదిద్దేవారు.  మనం చాలా మంది గురువులగురించి చదువుకున్నాము. బాబాను ఒక సాంప్రదాయానికి, ఒక మతానికి ముడివేసి చెప్పలేము. పరమాత్మకు మతం లేదు. ఒక పరిమితి లేదు. కొందరు బాబా ముస్లిమా లేక హిందువా అనే సందేహం వ్యక్తపరుస్తారు. ఆత్మతత్వంలో ఉండే యతీంద్రులకు శరీర భావనే లేకపోతే ఇంక మతమెక్కడ, సంప్రదాయమెక్కడ. బాబా దేవుడా కాదా అనే ప్రశ్న చాలామంది వేస్తుంటారు. మన ఉపనిషత్తులు పరమాత్మ తత్వాన్ని బోధిస్తాయి. అంతా ఒక్కటే అయినప్పుడు ఈ బేధభావాలు ఎందుకు? ఇదే విషయాలను హేమద్పంత్ గారు ఈ అధ్యాయం మొదట్లో చక్కగా విశదీకరించారు. అందుకే బాబా అష్టోత్తరంలో సమ సర్వమత సమ్మతాయ నమః అని మనము చదువుకుంటాము. బాబా అల్లాహ్ మాలిక్ అని ఎప్పుడు భగవన్నామ స్మరణ చేసే వారు. నిత్యా అగ్నిహోత్రం ధుని రూపంలో రోజు వెలుగుతూ ఉండేది. సర్వ మతాల సారం ఒక్కటే అని బోధించేవారు. షిర్డీ గ్రామంలో శని, గణపతి, పార్వతి-శంకర, గ్రామ దేవత, మారుతి మొదలగు దేవాలయాలను తాత్యాపాటీలు ద్వారా ఉద్ధరించడం జరిగింది. బాబా చాలా నిరాడంబర జీవనం గడిపారు. రోజు ఎంత ధనం దక్షిణ రూపంలో వచ్చినా కాని చివరికి ఏమి మిగిలేది కాదు. ఆ ధనమంతా అందరికి పంచేసే వారు. బాబా దగ్గరకు వచ్చిన వారికి వారి కర్మానుసారంగా కోరికలను తీర్చే వారు.

బాబా ఎల్లపుడు ఆత్మా స్థితిలో ఉండే వారు. ఒక్కొక్కప్పుడు శరీర స్పృహ లేకుండా ధుని దగ్గరే కూర్చుండిపోయే వారు. కొన్నిసార్లు సరదాగా అందరిని ఆటపట్టించే వారు. మొట్టమొదటలో రోగులను పరీక్షించి ఔషదములు ఇచ్చేవారు. మనకు యోగ శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నింటిలో అసాధారణమైన ఖండ యోగం చేసే వారు. వారి శరీరాన్ని ముక్కలుగా చేసి మరల వాటిని దగ్గరకు చేర్చే వారు అని సత్చరిత మనకు చెప్తుంది. అలానే ధౌతి ప్రక్రియలో భాగంగా బాబా తన ప్రేగులను బయటకు తెచ్చి కడిగి ఆరవేసే వారు అని చెప్తారు. ఇవన్ని ఎంతో అసమానమైన యోగ ప్రక్రియలు. పతంజలి యోగ శాస్త్రంలో ఎన్నో యోగ శక్తుల గురించి చెప్తారు. బాబా తన భక్తులను రక్షించడానికి మాత్రమే తన శక్తులను వాడే వారు. అయినా వారు సామాన్య మైన ఫకీరులాగా వ్యవహరించేవారు. తాను ఏమి చేయనట్టు, అంతా భగవంతుని లీలగా చెప్పే వారు.
  
బాబా తన భక్తులు ఎక్కడ ఉన్నా వారిని కష్టాలనుంచి రక్షించేవారు. ఒకరిని రక్షిస్తే, ఇంకొకరిని కర్మానుసారంగా వచ్చిన పాపాన్ని పోగొట్టడానికి సేవ చేయనిచ్చేవారు. ఒక సారి 1910 వ సంవత్సరంలో దీపావళి పండగ ముందురోజున ధునిలో కట్టెలు వేస్తూ తన చేతిని మంటలో ఉంచుతారు. మంటకు చేయి కాలుతూ ఉంటె మాధవుడనే అతను మరియు శ్యామా బాబా చేతిని బయటకు లాగుతారు. ఇదంతా ఒక కుమ్మరి భక్తుని బిడ్డ కొలిమిలో పడబోతు ఉంటె కాపాడే సందర్భం. ఆయన చేయి కాలకుండా కూడా ఆ బిడ్డను రక్షించవచ్చు కాని అలా చేయలేదు. ఇక్కడ కర్మను తీసే వేసి తన శరీరం దాన్ని తీసుకునేటట్లు చేశారు అని మనము చెప్పుకోవచ్చు. బాబాకే ఆ సత్యం తెలియాలి. కాలిన చేతికి చికిత్స చేయించుకోకుండా భాగోజితో సేవ చేయించుకున్నారు. నానా తీసుకువచ్చిన పరమానంద్ అనే డాక్టరుకు చికిత్స చేసే అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ పరమానంద అనే పేరు ఆత్మ స్థితి
అని కూడా చెప్పుకోవచ్చు. బాబా ఎందరికో వారి వారి జబ్బులను నయం చేశారు. ఆయన శక్తి ముందు ఈ కాలిన గాయం ఒక లెక్క కాదు. ఇక్కడ ఒకరిని రక్షించి వారి నమ్మకాన్ని పెంచాలి. అలానే భాగోజి పూర్వకర్మలు పోగొట్టే గురు సేవను చేయనివ్వాలి. అలానే నానా చందోర్కరుకు పరమార్ధం బోధపడేటట్లు చేయాలి. నానాకు గురువుమీద ప్రేమ ఉంది. అందుకే ఒక పెద్ద పేరుమోసిన డాక్టర్నువెంటపెట్టుకొని వచ్చాడు. ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని బోధించే ప్రయత్నం చేసారు బాబా. మన అందరం కూడా ఒక్కో సారి గురువులను మామూలు మనుషులు లాగా చూస్తాము. ఇక్కడే వారి తత్వాన్ని అర్ధం చేసుకోవాలి. ఖాపర్డే కొడుకుకి వచ్చిన ప్లేగు జ్వరాన్ని తాను తీసుకొని వారికి ఉపశమనం కలిగిస్తారు. ఇలా బాబా మన అందరి జీవితాలలో కూడా అనేక లీలలు చూపిస్తూ ఉంటారు.

ఇలా కర్మలు తీసుకోవడమే కాకుండా మన జీవితంలో రోజు జరిగే సుఖ దుఃఖాలలో నేను ఉన్నాను అని నిరూపిస్తూ ఉంటారు. నానా చందోర్కర్ మామల్తదారుగా నందూరుబారులో పనిచేస్తూ ఉండగా ఆయనకు పండరీపురం బదిలీ అవుతుంది. పండరీపురం అంటే భగవంతుని ధామము. అటువంటి పవిత్ర స్థలంలో ఉండటం అంటే పూర్వ జన్మ పుణ్యము అని అక్కడి వారు భావిస్తారు. నానా అక్కడకు వెళ్లే ముందు బాబా ఆశీర్వాదం తీసుకునేందుకు షిర్డీ ప్రయాణం కడతాడు. అప్పటికే షిర్డీలో బాబా మసీదులో కూర్చొని అక్కడ ఉన్న వారితో కలిసి పండరి పోవాలి. అక్కడే ఉండాలి. అదే నా ప్రభువు నిజ ధామము అని పాట పాడుతూ ఉంటారు. అక్కడి వారికి బాబా ఈ పాట ఎందుకు పాడుతున్నారో నానా వచ్చిన తరువాత కాని అర్ధం కాలేదు. బాబా సర్వజ్ఞులు. మనకు ఏది మంచిదో ఆయనకు తెలుసు. మనం చేయవలిసిందల్లా ఆయనను నమ్మడం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాబాను మాత్రం మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడు మన పక్కనే ఉన్నారు అన్న సత్యాన్ని మరువకూడదు.


శ్రీ సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు !



Sri Saisatcharita Chapter - 7



Sai is paramaatma and omniscient. Sai is Parama Guru. He knows what is in our minds and he will help us to go through past karmas. Sai is part of our lives and he helps us in difficult times of our lives.  He will keep us on the track even in good times so that we do not lose sight of reality. We learnt about so many Gurus and most of them taught the truth and made their devotees experience this truth. We also saw different belief systems and different religions. But Baba never was limited to one Sampradaaya and even one religion.  Supreme God does not belong to one religion and if so, how can this supreme energy be called God? When you are in Atma Sthithi (Self realized), there is no Sarira Bhavana and for them everything is nothing but God. So why we have to argue about religions and different faiths? The discussion that whether Baba is Muslim, Hindu, Guru or God is not even essential if we understand the purpose of incarnation of Paramaatma. Lord Sri Krishna says in Bhagavadgita that God comes in the form of Great Gurus. This very truth was told by Hemadpanth in this chapter.  This is the very reason we chant "Sama Sarvamata Sammataaya" in our Sai Ashttotharam.

Baba always used to recite God's name by saying "Allah Maalik" and used to keep Dhuni lighted like Nitya Agnihotra. Sai never had any preference towards one religion or one faith. Only thing he believed in is Supreme God and to follow the path of our Guru. Sai renovated the temples in Shirdi and encouraged Taatya patil to complete these projects. Sai lived very ordinary life and taught us how to live when we are treading the path of spirituality. Whatever people gave in the form of Dakshina, he used to distribute this to poor and other people. By the end of the day, he is always left with nothing. Whoever came to him were granted their wishes according to their eligibility and based on past karmas.

Baba always stayed in a blissful state and sometimes had no feeling of body. There was no question of ego. He used to sit near dhuni for hours in samadhi state. He also gave some natural remedies to some illnesses. He was the epitome of science of Yoga. The Satcharita talks about mainly Dhouti and Khanda Yoga. Baba did special kind of Dhouti where he used to bring out all his intestines and wash them near a well. Someone once saw Baba's body in pieces and got scared. But next day Baba was found as usual in Dwarakamai. This is unique yoga where you make your body into pieces and bring them together later. This is an extraordinary power one can have. Baba never used his powers unless this was helpful to his devotees. He always used to praise God for everything.

Baba always protected his devotees from all kinds of situations. On one hand he protected his devotees and also gave them an opportunity to burn their past karmas by giving them the strength to endure. Once in 1910 a day before Diwaali, Baba was sitting near the Dhini and putting some fire wood into Dhuni. Suddenly he keeps his hand in the Dhuni and leaves it there even though it was burning. Then Syama and Madhava pulls Baba away from the Dhuni. Then Baba tells them that he was protecting a child who accidentally fell from her mother's lap and about to burn in a furnace. He could have done this without him suffering the burns but he had to take off the past actions (Karmas). Here he not only is protecting the child but also providing an opportunity to Bhagoji to serve him so that he can burn his past bad deeds. He was suffering from leprosy and all his body parts were eroding with disease. Serving a Guru like Baba is superior to any other seva. Baba did not give permission to be treated by Dr. paramaanand who was brought by Nana Chandorkar. In this whole incident Baba did three things; By protecting the child from fire, child's parent's faith increased in Baba. Bhagoji was able to serve Baba. Then for Nana and for all of us to understand how Karma theory holds in life. Here Dr. Paramaanand name is also significant which might indicate Atma Sthithi (Total bliss) and Baba used to treat so many illnesses. He never wanted his body ailments to go away. He went through the course of those ailments. The burnt hand is not an issue given his yogic powers. But he is beyond this body, mind and intellect. In a similar way, Baba reassured Kaparde's wife when her son got Plague. Sai took the plague from the boy and cleared him from the disease. 

He will show his presence in the lives of his devotees. Once we start believing in Baba he will protect us from any bad outcomes and also gives us his blessings. Nana Chandorkar was working in Nandurbar and was transferred to Pandharpur. Nana was considered to be blessed as Pnadharpur is a holy place. But Nana's Pandharpur is Shirdi where Baba is. So he wanted to get the blessings of Baba before he goes to Pandharpur. Baba was sitting in Dwarakamai and no body knew that Nana was coming to Shirdi. Baba was with Mhalsapathi, Appa Shinde, kashiram and some other devotees and started singing like this "The doors of Pandharpur are open. I am going to Pandharpur- going,going, There I will stay. There I will stay, Stay. That is the abode of my Master". When Nana came to Shirdi devotees told him that Baba was singing about going to Pandharpur. Nana was surprised and understood the greatness of Baba. He took Baba's blessings, udi prasad and left to Pandharpur. Baba knows everything. We just need to trust him and love him. We should not forget him in both pleasures and pains. He is always with us and protects us.



Sri Sadguru Sainathaarpanamasthu!

Wednesday, November 8, 2017

Sri SaiSatcharita Chapter - 6



Every devotee's heart can be considered as Shirdi and we learned in the last chapter that how Baba arrived in Shirdi. If Baba is not there Shirdi has no significance. In a similar way if we do not have Baba in our hearts there is no use calling ourselves as devotees of Baba. In the sixth chapter of Sai Satcharita Hemadpanth talks about how Guru's touch and blessing changes our lives. Baba also gave us some important discourse on how to grow in spirituality. This chapter on the out side talks about Ursu festival, Chandan utsav and Srirama navami celebrations. But these incidents have so much spiritual significance behind them. We will try to learn these special aspects. There is so much scriptural points mentioned in this chapter and we will shed some light on all of them.

We worship Baba most of the time and the devotees experience some kind of bliss. We will try to experience similar kind of bliss right now. Let us close our eyes and let us immerse our selves in Sai's world. Let us imagine that we are at Dwarakamai and Sai arathi is just finished. After Arathi is done Baba is sitting on the steps of Dwarakamai and people are standing in line to get the blessings of Baba.  We can see glowing and mesmerizing form of Baba in front of us. Baba is wearing the long white Kaphni and there is a scarf on his head. This scarf is tied in such way that part of it hanging by the side of his left ear. There is a glow behind him and the fire from Dhuni is lighting behind Sai. The back wall in the Dwaramai is decorated with garlands. This reminds us the formless Nirguna aspect of Sai.  As we are thinking this way we approached Sai and our heart is filled with joy. We are seeing our Guru and the moment came so that we can get his blessings. As soon as the boon giving hand, which has the Udi from Dhuni touches my head, my heart goes into rapture with inner happiness and my eyes brim with love. Sai is filled in my heart and there is no such thing as mine anymore. Everything was Sai and I do not exist anymore.  Sai is my Sriram, Srikrishna and Siva. He is the embodiment of all the Gods.  He is also the formless Nirguna. Let this feeling stay forever. Like this Hemadpanth showed us the ecstasy of Baba's touch and his presence. This experience he compared to the ultimate experience of Self realization.

There was a circle inspector by name Gopal Rao Gund who had no children, came to Baba and was blessed with children. Then he had the urge to do Urs utsav on Srirama Navami day. They got the permission from Baba in 1897. But Shirdi had only 2 water wells at that time and one was empty without water and the other had salt water in it.  Baba blessed these and put some flowers in those wells and the problem was solved. Tatya also got some water form other sources. So there was no problem during the Ursu festival.   We all want to celebrate this kind of festivals in the name of Baba but we lack bakthi or it is tainted with the Arishad vargas (Anger, greed, desire etc.) These qualities are like the salt water in those wells.  That's why we have to surrender to Baba with faith and patience. Then Baba will bless us so that we can become pure. Then Damu anna also joins the Ursu utsav by donating another flag for the procession. He also benefited and blessed by Baba with children. Later Amir Shakkar started Chandan utsav in the evenings. These two festivals went on from 1897 to 1911. Then comes Sri Krishna Jogiswar Bhisma who initiated the Sri Ramanavami festival on the same day along with tow other celebrations. 

Because of Radhakrishna Mai Shirdi became an organizations with all the additional items like Pallaki, horse, bells and other items.  She also sent a cradle on the day of Sri Ramanavami to Dwarakamai. People enjoyed the celebration and in the end they started throwing around the gulal (red powder). Little bit of this red powder fell in Baba's eyes and he became angry and started yelling. Some people got scared and ran away. Others who knows Baba stayed back as they know that he is trying to get rid of some bad luck by being angry. They felt these were Baba's blessings.  Satcharita says that when ever there is a new task that is initiated Baba always blessed like this. Even when they started repairing the Dwarakmai, Baba got hold of Tatya, removed his head scarf and threw it in the Dhuni.  Later on he calms down and gets a new Scarf and gives it to Tatya. We all want to celebrate these important festivals but some times we get carried away and forget the Bakthi part of it. The scarf here indicates the Ego which Baba wants us to get rid off. He has to throw this in the fire that is Jnana. Then only we will be in the right path. If we follow his path, he will then take away our head scarf that is ego.

If we have to get rid of our ego (ahamkara), what do we need to do and how we can stay close to Baba? These were well explained in the beginning of this chapter by Baba himself. Let us see what those words were because they are very useful to reach our goals. We need dispassion towards the worldly objects. This might be difficult to follow but if we have Baba in our lives nothing is difficult.  

These are Baba's words and Hemadpanth compiled them in this chapter and please read them as spoken by Baba.  

Those who wholeheartedly worship me and lovingly always serve me, I look after their well-being. This I know to be my motto. There will never be shortage of food and clothing. Therefore do not hanker after them. 

One should seek honor at the door of God; and should beg only from God. Ask only for his blessings. Worldly prestige should be left aside. 

Why are you satisfied by the honor given to you by the society? Why are you infatuated by this honor? Rather seek through intense devotion to move your chosen deity to compassion and to express your joy through copious streams of Satvik Bhava.  

May you find joy in such striving. Let all the faculties be seized with such a devotional urge so that the passions of the senses may be transformed completely and sprout devotional worship. What desire will then remain? 

May such devotion be your constant preoccupation leaving no relish fro anything else. 

May the mind be engaged in constant chanting of my name and let everything else be forgotten. Then there will be no thought of body, home, and wealth. The heart will be fixed in infinite happiness. The mind will be balanced and serene; and it will find fulfillment in it self. 

A contended mind is the surest sign of association with the holy.How can a wandering mind be considered as being surrendered to God?  

These are most provocative words spoken by Baba and we need to remember them always. 
 


Sri Sadguru Sainatharpanamasthu!
 
 
 
 
 
 







శ్రీ సాయిసత్చరిత అధ్యాయం -6



ప్రతిఒక్క భక్తుని హృదయం షిర్డి అని మనం చెప్పుకోవచ్చు. సత్చరిత ఐదవ అధ్యాయంలో బాబా షిరిడీ ఆగమనం గురించి తెలుసుకున్నాము అంటే గురువు మన హృదయమనే షిర్డీలో ఉంటేనే ఆ షిర్డీకి ప్రాముఖ్యత. ఆయనను మన హృదయపీఠంలో ప్రతిష్టించుకుంటే మనలో తప్పకుండా మార్పులు వస్తాయి. ఇప్పుడు ఆరవ అధ్యాయంలో గురు స్పర్శతో ఆ మార్పులు ఎలా సంభవిస్తాయి, మనం మన జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలో కూడా బాబా చెప్పారు. పైకి మాత్రం ఉర్సు ఉత్సవము, చందన ఉత్సవము మరియు శ్రీరామ నవమి ఉత్సవాల గురించి చెప్పిన వీటిల్లో చాలా పరమార్ధం ఉంది. వీటన్నటిలో బాబా మనకు ఏమి నేర్పిస్తున్నారో పరిశీలిద్దాము. మొట్టమొదట ఈ అధ్యాయంలో చాలా వేదాంత విషయాలు చెప్పారు. అవన్నీ సందర్భాన్ని బట్టి చెప్పుకుందాము.

బాబాకు మనం రోజు పూజ చేసుకుంటాము. ఆయన భక్తిలో చాలామంది పరవశం పొందుతారు. అలాంటి పరవశమే ఇప్పుడు మన అందరమూ పొంద ప్రయత్నిద్దాము. బాబా ఆరతి అయిన తరువాత ద్వారకామాయి అరుగు మీద కూర్చొని ఒక్కొక్కరికి నుదిటిన ఊది పెట్టి ఆశీర్వదించి పంపుతారు. ఒక్కసారి మనం కూడా ఆ అనుభూతిని పొందుదాము. ఇప్పుడే ఆరతి అయిపొయింది. మనమందరము ఒక వరుసలో బాబా ఆశీర్వదంకోసం తపిస్తూ ముందుకు నడుస్తున్నాము. బాబా దివ్యమంగళ రూపం మనకు కనిపిస్తుంది. ఆయన పొడవాటి తెల్లని కఫ్ని  ధరించి ఉన్నారు. తలపై ఒక తెల్లటి గుడ్డను చుట్టి దాని అంచులు జడవలె మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవుమీదగా వెనుకకు వేలాడుతూ ఉంది. బాబా వెనక ద్వారకామాయిలో ఉన్న ధుని మంట కనపడుతుంది. ఆ ధుని వెలుతురు బాబా తల వెనక ఒక కాంతిపుంజంలాగా కనపడుతూ ఉంది. వెనుక గోడ దగ్గర ఉన్న గూడు, పూల మాలలతో ఉన్న నింబారు బాబా యొక్క నిర్గుణ స్వరూపాన్ని గుర్తుచేస్తుంది. ఇంతలోనే బాబా ఎదురుగా చేరుకున్నాము. ఆయన దగ్గరకు వెళ్ళగానే ఎదో తెలియని అనుభూతి. అలానే మనసులో నా తండ్రిని చూస్తున్నాను, ఆయన ఆశీర్వాదాన్ని పొందబోతున్నాను అనే ఉత్కంఠ. అంతలో బాబా కుడిచెయ్యి పైకి లేచింది. నా కళ్ళు మూతలు పడ్డాయి. ఊది నుదిటిపై పెట్టి బాబా తన చేతిని నా తలపై ఉంచారు. నా మనస్సు సంతోషంతో నిండిపోయి, కండ్లనిండా ప్రేమ పొంగిపోయింది. ఈ ఆనందానికి అవధులు లేవు. నా గురువు నా హృదయంలోనే ఉన్నారు అన్న భావన అధికం అయింది. నేను నీవు అన్న భావన ఈ స్పర్శతో నశించింది. సాయియే సర్వం అనిపించింది. అంతా సాయి మయం, ఎదో ఎప్పుడు లేని అనుభూతి. సాయే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరమ శివుడు. సాయే సర్వదేవతా స్వరూపము. సాయే నిర్గుణము. ఈ అనుభూతి ఎప్పుడూ ఇలాగే ఉండిపోతే బాగుంటుంది అని మనసులో ఆరాటం. హేమద్పంత్ గారు గురు కర స్పర్శ  ప్రభావం గురించి మనకు కళ్ళకు కట్టినట్లు చూపించి అందులో ఉన్న పరమార్ధాన్ని తెలిపారు. ఈ అనుభవం బ్రహ్మైక్య భావనతో సమానమైనదిగా చెప్పారు.


ఈ అధ్యాయంలో బాబా మనకు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. అవి చివరలో తెలుసుకుందాము. గోపాలరావు గుండ్ అనే పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు పిల్లలులేక బాబా దగ్గరకు వస్తారు. ఆయనకు మగ బిడ్డ పుడతాడు. అప్పుడు ఆయన శ్రీరామ నవమి రోజున ఉర్సు ఉత్సవము చెయ్యాలి అని 1897 లో బాబా ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ ఉత్సవానికి చాలా మంది వస్తే నీటి కొరతను ఎలా తీర్చాలి అనే సందేహం అందరిలో ఉంది. అప్పుడు షిర్డీలో రెండే నీటి బావులు ఉండేవి. ఒకటి పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ఒకదానిలో ఉప్పు నీరు ఉంటుంది. బాబా కొన్ని పూలు తీసుకొని ఉప్పు నీరు ఉన్న బావిలో వేశారు. అవి మంచి నీరుగా మారినవి. అలానే నీరులేని బావిలో నీరు పుష్కలంగా వచ్చింది. ఇలా బాబా లీలలను మనం చదువుకున్నాము. మనందరికి ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవాలని ఉంటుంది. కాని ఒక్కోసారి మన మనస్సులో భక్తి అనే నీరు ఉండదు. ఒక వేళ నీరు ఉన్నా, అంటే భక్తి ఉన్నా కామ క్రోధ మద మాత్సర్యాలనే ఉప్పు నీరు అడ్డు పడుతూ ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ శ్రద్ధ సభూరిలతో బాబా అనుగ్రహాన్ని కోరుకోవాలి. అప్పుడు బాబా మనలో ఉన్న ఈ అవగుణాలను తొలిగిస్తారు. తరువాత కథలో దాము అన్నా కూడా ఈ ఉత్సవాల్లో భాగమై రెండు జండాలు తయారు చేపిస్తారు. ఉర్సు మరియు చందన ఉత్సవాలు 1897 నుంచి 1911 వరకు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు కృష్ణారావు జోగీశ్వర భీష్మ గారికి అదే రోజు శ్రీరామనవమి ఉత్సవం కూడా జరుపుకుంటే బాగుంటుంది అని మనసులో అనిపించింది. తరువాత బాబా అనుమతితో ఈ ఉత్సవం కూడా భక్తులు జరుపుకోవడం మొదలు పెట్టారు.

రాధాకృష్ణమాయి చొరవతో షిర్డీ ఒక సంస్థానంగా రూపుదిద్దుకొన్నది. శ్రీరామనవమి  కోసమని ఆమె ఒక ఊయలను ద్వారకామాయికి పంపినది. ప్రజలు అందరు ఉత్సాహంతో జయ జయ ధ్వనులు చేస్తూ ఎర్ర రంగు పొడిని చల్లుకుంటూ ఉండగా ఆ పొడి కొంచెం బాబా కళ్ళలో పడింది. అంతలో బాబా కోపముతో అందరిని తిట్టడం ప్రారంభించారు.  కొందరు బయపడి పారిపోయారు. కొందరు ఆ తిట్లు ఆశీర్వాదంగా భావించారు. ఏదైనా కొత్తవి మొదలుపెట్టినప్పుడు బాబా ఇలా కోపగించడం గురించి సత్చరిత మనకు చెప్తుంది. మనం అర్ధం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఉంది ఇక్కడ. మనం ఒక్కో సారి ఆర్భాటాలకు పోయి అసలు భక్తి అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాము. ఇది గుర్తు చేయడమే బాబా ఉద్దేశ్యం అయిఉండవచ్చు. అలానే మసీద్ మరమ్మత్తులు చేపించే సందర్భంలో తాత్యా తలపాగాను మంటలో వేసి ఆయన గొంతుని పట్టుకుంటారు. తరువాత ఆయనే ఒక నగిషీ చెక్కిన తలపాగాను తెప్పించి తాత్యా తలకు చుడతారు. మన అందరకు మంచి పనులు చేయాలని, దైవ కార్యాలలో పాల్గోవాలని మంచి సంకల్పం ఉంటుంది. కాని మనలోని పూర్వ వాసనలు అహంకారమై మన తలలోనే ఉంటాయి. ఇదే మనం చుట్టుకొనే తలపాగా. ఈ అహంకారమనే తలపాగా బాబా తీసి జ్ఞానమనే ధునిలో వేస్తె కాని మనలో ఉన్న అహంకారం పోదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే తాత్యా ప్రేమించినట్లు బాబాను ప్రేమించాలి, బాబాకు దగ్గర అవ్వాలి. ఆయన చెప్పిన మార్గంలో నడవాలి. అప్పుడే ఆయన మన తలపాగాను కూడా తీసి వేస్తారు.

మనలో ఉన్న ఈ అహంకారం పోగొట్టుకోవాలి అంటే మనం ఏమి చేయాలి? మనం బాబాకు ఎలా దగ్గర అవ్వాలో అన్న విషయాలు ఈ అధ్యాయం మొదట్లో బాబా స్వయంగా చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము. వాటిని మన జీవితంలో భాగంగా చేసుకుందాము. ఇవి అనుసరించడం కష్టమే మనం అనుకోవచ్చు. ఒక లక్ష్యం పొందాలి అంటే సాధన కావాలి, వైరాగ్యం ఉండాలి.

బాబా చెప్పిన అనుగ్రహ వాక్యాలను హేమద్పంత్ ఈ అధ్యాయంలో మొట్టమొదట పొందుపరచారు.

నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందె భక్తిశ్రద్ధలతో మనస్సు నిలిపిన వారి యోగక్షేమములు నేను చూచెదను. కావున వీటికొరకు ప్రయాస పడవద్దు.

ప్రపంచములో కీర్తిప్రతిష్టలకోసం ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు పొందుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను బ్రమను వీడుము.

లోకులు గౌరవించినంత మాత్రాన తనను తాను మర్చిపోవాలా? ఆరాధ్య మూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయం మీదే ప్రీతి కలగాలి.

సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియవికారాలు భక్తివైపు మొగ్గాలి. ఇతర విషయాలపై ప్రీతిలేకుండా ఎల్లప్పుడూ మనసులో భజన జరగాలి.

మనస్సు నందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్త ఇంద్రియములను భగవంతుని ఆరాధనకు నియమించుము. ఇతర విషయములపైకి మనసుని పోనివ్వకము.

మనసు అన్నిటిని మర్చిపోయేలా నామస్మరణ యందు లగ్నం చెయ్యాలి. అప్పుడు శరీరం, గృహం, ధనం అవేవి గుర్తు ఉండవు. సత్సంగం చేసిన ఫలితంగా చిత్తవృత్తి శాంతించాలి. చిత్తం పరమానందంతో ప్రశాంతతను పొందుతుంది.

ఇలా బాబా మనకు సాధనలో ఉపయోగపడే చాలా విషయాలు ఈ అధ్యాయంలో చెప్పారు. మనం ఆధ్యాత్మిక పధంలో ఎదగాలి అంటే ఇవి పాటించక తప్పదు. బాబా పై నాకు భక్తి ఉంది అంటే సరిపోదు. ఆయన చెప్పిన సూచనలను తప్పకుండా పాటించాలి. అప్పుడే మనము నిజమైన సాయి భక్తులుగా ఎదగగలుగుతాము. సాయికి నిజంగా దగ్గర అవ్వగలుగుతాము.



శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు!